Bigg Boss Siri Hanmanth Open Up On Her Marriage With Shrihan - Sakshi
Sakshi News home page

Siri Hanmanth-Shrihan: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి!

Jan 10 2023 5:51 PM | Updated on Jan 10 2023 6:50 PM

Bigg Boss Siri Hanmanth Open Up on Marriage With Shrihan in Live Chat - Sakshi

షార్ట్‌ ఫలింస్‌, రీల్స్‌తో పాపులర్‌ అయిన జంటలో సిరి హన్మంత్‌, శ్రీహాన్‌ జంట ఒకటి. రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ వీరిద్దరు జంటగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్‌లో ఉంటున్న వీరిద్దరు బిగ్‌బాస్‌ షోతో బాగా పాపులర్‌ అయ్యారు. సిరి హన్మంత్‌ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో, శ్రీహన్‌ బిగ్‌బాస్‌ 6వ సీజన్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తనదైన ఆట, చలాకితనంతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సిరి మరోవైపు విపరీతమైన నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్‌ నిర్మాత

హౌజ్‌లో తన కో-కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో అతి సన్నిహితంగా మెదిలి ట్రోల్స్‌ బారిన పడింది. బయటకు వచ్చాక శ్రీహాన్‌తో ఆమెకు అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి మనస్పర్థలు తొలగడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ తర్వాత విడిపోయిన షణ్ముఖ్‌, దీప్తి సునేయన మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సిరీ బర్త్‌డే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ 6వ సీజన్‌లో రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సిరి బర్త్‌డేను చాలా గ్రాండ్‌ సెలబ్రెట్‌ చేశాడు. ఆమెకు కాస్ట్లీ డైమండ్‌ రింగ్‌ కూడా బహుమతిగా ఇచ్చాడు.

చదవండి: నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: కిరణ్‌ అబ్బవరం 

ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించిన సిరి శ్రీహాన్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ సిరి-శ్రీహాన్ పెళ్లిపై ప్రశ్నించాడు. ‘శ్రీహాన్‌ను మీరు త్వరగా పెళ్లి చేసుకోండి. మాకు చూడాలని ఉంది’ అని కోరాడు. ఇందుకు సిరి స్పందిస్తూ.. తప్పుకుండా.. త్వరలోనే చేసుకుంటామని సమాధానం ఇచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. మరోవైపు ఈ ఏడాది సిరి-శ్రీహాన్‌లు పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా కొంతకాలంగా రిలేషన్‌లో సిరి-శ్రీహాన్‌ ఓ బాబును దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement