Siri Hanmanth Open Up About Her Breakup with Shrihan - Sakshi
Sakshi News home page

Siri Hanmanth: శ్రీహన్‌తో గొడవలు.. రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగా

Published Fri, Dec 9 2022 4:44 PM | Last Updated on Sat, Dec 10 2022 5:55 PM

Siri Hanmanth Open Up About her Breakup with Shrihan - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో షణ్ను- సిరిల ఫ్రెండ్‌షిప్‌ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్‌, నటుడు శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్‌.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్‌ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. అంత మంచివాడిని ఎలా మోసం చేయాలనిపించిందంటూ నానామాటలన్నారు. కట్‌ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్‌ పెడుతూ మరింత దగ్గరయ్యారు.

ఈసారి శ్రీహాన్‌ షోలో అడుగుపెట్టాడు. గేమ్‌ బాగా ఆడుతున్నాడు. కానీ వెటకారం, ఫ్రెండ్‌షిప్‌ వల్ల గెలుపుకు దూరం అవుతున్నాడు. అతడికి బయట నుంచి భీభత్సంగా సపోర్ట్‌ చేస్తోంది సిరి. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ కెఫెలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడింది. 'ఇంట్లో ఎవరూ శ్రీహాన్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌ ట్యాగ్‌ ఇవ్వలేదు. అది చూసిన నాకే ఎంతో బాధనిపించింది, ఆ పరిస్థితిలో శ్రీహాన్‌ ఎంత బాధపడ్డాడో! నాకు పెళ్లి కాకుండానే కొడుకు చైతూ ఎలా వచ్చాడనుకుంటున్నారు. అతడు మా మామయ్య కొడుకు. కరోనా సమయంలో వైజాగ్‌ వెళ్లాం. అప్పుడు మాకు బాగా దగ్గరయ్యాడు. మామయ్యకు ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో మేము తెచ్చేసుకుని పెంచుకుంటున్నాం. బహుశా ఏడాదిలోపు మా పెళ్లి కూడా అయిపోతుందనుకుంటా' అని చెప్పుకొచ్చింది.

బ్రేకప్‌ రూమర్స్‌ గురించి మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తర్వాత మా మధ్య చాలా గొడవలయ్యాయి. బ్రేకప్‌ వరకూ వెళ్లాము. అతడు నన్ను వదిలి వెళ్లాక నాకు కోవిడ్‌ వచ్చింది. ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్లిపోదామనుకున్నాను. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగాను. ఫోన్‌ ఆన్‌ చేయగానే శ్రీహాన్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్‌ ఎత్తకపోతే జీవితంలో కనిపించను అని మెసేజ్‌ పెట్టాడు. వెంటనే నేను కాల్‌ చేశాను, రోడ్డు మీద తిరుగుతున్న నన్ను వచ్చి తీసుకెళ్లాడు. అలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మేము ఎప్పటికీ విడిపోనంత దగ్గరయ్యాం' అని చెప్పుకొచ్చింది సిరి.

చదవండి: సూసైడ్‌ బాంబ్‌ అనుకొని అరెస్ట్‌ చేశారు: సత్యదేవ్‌
శ్రీసత్య, ఇనయల పరువు పాయే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement