బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ జీవితమే మారిపోయింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన ఆనంతరం మిగతా కంటెస్టెంట్స్ కంటే షణ్ముఖ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణంగా తన ప్రియురాలు దీప్తి సునయనతో విడిపోవడమే. ఎన్నో ఆశలతో, ఉత్సహంతో మూడు నెలల అనంతరం బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి వీరి గరించిన రకారకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు షణ్ముక్ మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఇన్‌స్టాలో బ్రేకప్ పోస్టులు, ఎమోజీలు పెడుతూ ఒంటరిగా గడిపేస్తున్నాడు. ఇక వీరి బ్రేకప్‌కు అందరూ సిరి కారణమని, ఆమెతో అతి సన్నిహితమే అతడి కొంప ముంచిందని ఫిక్స్ అయ్యారు. అయితే తమ బ్రేకప్‌కు కారణం సిరి కాదని, దానికి మరో రీజన్ ఉందంటూ ఆసక్తి కామెంట్స్ చేశాడు షణ్నూ. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా షణ్ను మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి బ్రేకప్ సిరి కారణం కాదు. చెప్పాలంటే సిరి, దీప్తి ఎప్పటికి మంచి స్నేహితులే. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది.
నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. అయితే సిరితో చనువుగా ఉండడం నెటిజన్లతో పాటు దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. దీంతో తన కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్ పై దృష్టి పెట్టాం… మేము మళ్లీ కలుస్తామా ? లేదా ? అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను.. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు..తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి’ అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు.
అంతేగాక ‘ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికే బిగ్‌బాస్ హౌజ్‌కు వచ్చాను. నిజం చెప్పాలంటే నా మూడీ పర్సన్‌కు బిగ్‌బాస్ కరెక్ట్ కాదు. నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను. నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా.. కానీ షో నుంచి బయటకు వచ్చాక నాపై ఎంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను’ అన్నాడు. ఇక ‘హౌజ్‌లో సిరికి నేను అండగా ఉన్నాను. ఇంటి సభ్యులు సిరిని ఎమైనా అంటే తనకు సపోర్ట్ ఇచ్చాను. కానీ అవన్నీ వదిలేసి సిరి వాళ్లమ్మ నన్ను తనను తప్పుగా అర్థం చేసుకోవడం బాధించింది’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment