
Bigg Boss Telugu 5, 12th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగింపుకు చేరుకుంటోంది. ఇప్పటివరకు 11 వారాల్లో పదకొండుమంది ఎలిమినేట్ అయ్యారు. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్ ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరిలో ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. మానస్ మినహా కాజల్, సిరి, రవి, షణ్ముఖ్, సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
అనఫీషియల్ ఓటింగ్‌లో షణ్ముఖ్, సన్నీ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతిసారి వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతుండటం విశేషం. వీళ్ల తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్ పోటీపడుతున్నారు. అంటే మొదటి నాలుగు స్థానాల్లో నలుగురు అబ్బాయిలే ఉండగా చివరి మూడు స్థానాల్లో అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఈ వారం మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాజల్, సిరి, ప్రియాంక ఎవరి స్టైల్లో వారు గేమ్ ఆడుతున్నారు. స్ట్రాటజీనే నమ్ముకున్న కాజల్ అప్పడం గొడవలో సన్నీకి సపోర్ట్ చేయడంతో అతడి ఫ్యాన్స్ ఈమెకు సేవ్ చేయడానికి ఓట్లేస్తున్నారు. సిరి.. మగరాయుడిలా గేమ్స్‌లో విజృంభించి ఆడుతుంటడంతో ఆమెకు కూడా మంచి ఓట్లు పడే అవకాశం ఉంది. మిగిలింది ప్రియాంక సింగ్. మిగతా ఇద్దరి కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో వెనకబడిన పింకీకి చాలా తక్కువ ఓట్లు గుద్దుతున్నారట!
మానస్ నామినేషన్స్‌లో లేకపోయినప్పటికీ అతడి అభిమానులు చాలామటుకు ఆమెకు ఓటేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పింకీ ఉంటే మానస్ గేమ్ దెబ్బతింటుందని, అతడు టాప్ 5కి చేరుకోవడంపై దృష్టి పెట్టలేడని అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆమెను బయటకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లవ్ ట్రాక్ కోసమైనా ఆమెను ఉంచాలనుకుంటే మాత్రం కాజల్, సిరిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది!
Comments
Please login to add a commentAdd a comment