
Bigg Boss Telugu Promo: బిగ్‌బాస్ అనుకుంటే ఏదైనా చేయగలడు. ఫ్రెండ్స్‌ను బద్ధ శత్రువులుగా, శత్రువులను మిత్రువులుగా మార్చగలడు. ప్రస్తుతం హౌస్‌లో సిరి, షణ్నుకు మధ్య ఫైట్ నడుస్తోంది. గత రెండు రోజులుగా వీరి మధ్యనున్న మనస్పర్థలు, గొడవలు నేడు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. స్నేహితుడిగా తనకు సపోర్ట్ చేయాల్సినవాడే జెన్యూన్‌గా ఆడలేదని విమర్శించడం, అందరి ముందే తనను దారుణంగా నిందించడం, కావాలని గొడవ చేయడం వంటి విషయాలను తట్టుకోలేకపోయింది సిరి. మరోసారి భోరుమని ఏడ్చేస్తూ షణ్ను మీద అసంతృప్తి వ్యక్తం చేసింది.
'అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు, వాడికి ఫ్రెండ్‌షిప్ విలువ తెలిస్తే కదా! అంతా ఫేక్, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ఉంటున్నాడు. నా ఫ్రెండ్‌షిప్‌కు వాల్యూ లేకుండా అయిపోయింది' అంటూ భోరుమని ఏడ్చేసింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు షణ్ను తన స్నేహాన్ని పక్కనపెట్టి సంచాలకుడిగా, కెప్టెన్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని, అతడు ఫేక్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. సిరి అనవసరంగా మరీ ఎమోషనల్ అయిపోయి అటు తన గేమ్‌తో పాటు షణ్ను గేమ్ కూడా నాశనం చేస్తోందంటున్నారు. మరి షణ్ను ఈ పరిస్థితిని ఎలా డీల్ చేస్తాడో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment