
రాత్రిపూట మానస్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు. అతడు బాగుంటాడని సిరి కామెంట్ చేయగా 'నీ దిష్టే తగులుతుందే, ఏం కళ్లే అవి..' అంటూ పింకీ...
Bigg Boss Telugu 5 Promo: షణ్ముఖ్, శ్రీరామ్ మధ్య ఫైట్ ఇంకా నడుస్తోనే ఉంది. శ్రీరామ్ ఏం చేసినా తప్పు కాదు, కానీ మేము చేస్తే తప్పా? అని షణ్ను అసహనానికి లోనయ్యాడు. మరోపక్క శ్రీరామ్.. నేనెందుకు అతడి వెంట పడతాను, ఆయన ఇష్టముంటే మాట్లాడనీ, లేకపోతే లేదు అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు. ఇక సంచాలకురాలిగా కాజల్ ఎలా వ్యవహరించిందో ఇమిటేట్ చేసి చూపిస్తూ అందరినీ నవ్వించాడు సన్నీ. 'సీరియస్‌గా ఆడితేనే గెలుస్తామని, కామెడీగా ఆడితే ఎప్పుడూ ఓడిపోతాం' అని పింకీకి సలహా ఇచ్చాడు జెస్సీ. మరోపక్క షణ్ముఖ్, సిరికి మధ్య మరోసారి గొడవైనట్లు తెలుస్తోంది. పెద్ద పుడుంగి నడుచుకుంటూ వచ్చిందని షణ్ను సెటైర్ వేయడంతో సిరి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయింది. కానీ తర్వాత ఆమె రాకకోసం తెగ ఎదురుచూశాడు షణ్ను. సిరిని రమ్మనురా.. అని రిక్వెస్ట్ చేయడంతో షాకైన జెస్సీ.. నువ్వే వెళ్లి చెప్పు అని ఆన్సరిచ్చాడు.
ఇక రాత్రిపూట మానస్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు. అతడు బాగుంటాడని సిరి కామెంట్ చేయగా 'నీ దిష్టే తగులుతుందే, ఏం కళ్లే అవి..' అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. దీంతో మరింత రెచ్చిపోయిన సిరి.. ఎంత క్యూట్ ఉన్నాడో అంటూ మానస్‌కేసి చూడగా వెంటనే పింకీ ఆమె చూపు తిప్పేస్తూ పడుకోబెట్టింది. ఇక హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌లో విశ్వ గెలిచి కెప్టెన్‌గా అవతరిచినట్లు సమాచారం!