
Bigg Boss 5 Telugu, Episode 95: బిగ్‌బాస్ జర్నీ ముగింపుకు వచ్చేకొద్దీ హౌస్‌లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా ఉండే సిరి ఈ మధ్య మరీ డల్ అయిపోయింది. ఆమె అలా అవడానికి మూల కారణం షణ్నూనే అని అభిప్రాయపడ్డారు మానస్, కాజల్. షణ్ను చూపులతోనే సిరిని కంట్రోల్ చేస్తున్నాడని మానస్ అభిప్రాయపడ్డాడు. ఇది స్వయంగా తాను గమనించానని పేర్కొన్నాడు. కానీ దీనివల్ల సిరి ఇండివిడ్యువాలిటీ కోల్పోతుందని చెప్పుకొచ్చాడు.
బిగ్‌బాస్ జర్నీలో హైలైట్ అయిన సీన్లను తిరిగి ప్లే చేసే గేమ్‌లో.. శ్రీరామ్- జెస్సీలకు కిచెన్‌లో జరిగిన గొడవను రీక్రియేట్ చేసి చూపించాలన్నాడు బిగ్‌బాస్. అయితే షణ్ను మాత్రం ఇప్పటికే ఈ టాస్కుల్లో తనను చులకన చేస్తున్నారని అసహనానికి లోనయ్యాడు. మాటలు అంటే పడ్డాను, కానీ ఇమిటేట్ చేస్తే మాత్రం నచ్చదంటూ గొణుక్కున్నాడు. అసలు ఈ టాస్కులోనే పాల్గొననంటూ మొండిపట్టు పడ్డాడు. అతడిని కూల్ చేయడానికి వెళ్లిన సిరి మీద కూడా శివాలెత్తాడు. నువ్వు కూడా నన్ను తక్కువ చేస్తున్నావంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు.
తర్వాత సిరి వచ్చి సారీ చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. నీవల్ల నాకేం నెగెటివ్ లేదు, నీ మంచి కోసం మాట్లాడితే నేను నెగెటివ్ అవుతున్నాను అంటూ చిర్రుబుర్రులాడాడు. మిగతా హౌస్‌మేట్స్ అందరూ ఎంతో నువ్వు కూడా అంతేనంటూ తేల్చి పారేశాడు. నువ్వు అవసరం లేదు, వెళ్లిపో అని వార్నింగ్ ఇచ్చాడు. 'నాదగ్గర చాలా ఫ్రీడమ్ తీసుకున్నావ్‌రా... అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్ ఒరేయ్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్ ఒక్కటే గుర్తుంది..' అంటూ సిరిని నానామాటలు అన్నాడు. వీళ్లిద్దరి గొడవలో తన తల్లిని కూడా లాగడంతో తనకు తెలియకుండానే సిరి కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. కానీ ఆమె బాధపడటానికి కూడా షణ్ను ఒప్పుకోలేదు. సారీ చెప్పి ఆమెను బుజ్జగించాడు. అలా కాసేపటికే ఇద్దరూ కలిసిపోయి హగ్గిచ్చుకున్నారు.
సీన్ రీ క్రియేషన్ టాస్కులో హమీదా ట్యాగ్ మెడలో వేసుకున్న సన్నీని చూడగానే శ్రీరామ్‌లో ప్రాణం లేచి వచ్చినట్లైంది. మిస్ యూ హమీదా అంటూ సన్నీని హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు జరిగిన రీ క్రియేషన్ టాస్కులో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్‌గా హౌస్‌మేట్స్ షణ్నును ఎంచుకున్నారు. దీంతో అతడు ఆడియన్స్‌ను ఓటేయమని అడిగే అర్హత పొందాడు. 'ప్రేక్షకులే నా దేవుళ్లు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడున్న అందరికీ ఓటేయండి, నాకు కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరాడు. అనంతరం ఎక్కువసేపు నవ్వకుండా ఉండాల్సిన టాస్క్‌లో మానస్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment