బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫ్యామిలీ వీక్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. వారాల తరబడి అయినవారికి దూరంగా ఉన్న హౌస్‌మేట్స్ కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను చూడగానే ఎగిరి గంతేస్తుంటారు. ప్రస్తుతం ఆరో సీజన్‌లో కూడా సేమ్ సిచ్యుయేషన్. 12 వారాల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ను చూడటంతో భావోద్వేగానికి లోనవుతున్నారు టాప్ 9 కంటెస్టెంట్లు. నిన్న ఫైమా, శ్రీసత్య, రోహిత్ తల్లి హౌస్‌లోకి రాగా ఈ రోజు ఎపిసోడ్‌లో శ్రీహాన్ ప్రియురాలు సిరి, తన కొడుకు చైతూతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.
హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్. నీకోసం ఓ సర్‌ప్రైజ్ అంటూ వెనక్కు తిరిగి మెడ కింద శ్రీహాన్ అని పొడిపించుకున్న పచ్చబొట్టు చూపించింది. అలాగే కొడుకు చైతూను తీసుకొచ్చింది. అతడు లోపలకు రాగానే తన మాటలతో చెలరేగిపోయాడు. హౌస్‌మేట్స్ తరచూ ఏమేం డైలాగ్స్ వాడతాడో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సర్‌ప్రైజ్‌లు చూసి శ్రీహాన్ సంతోషంలో మునిగి తేలాడు. నిజానికి ఇదంతా లైవ్‌లో నిన్ననే టెలికాస్ట్ అవగా ఈరోజు ఎపిసోడ్‌లో చూపించనున్నారు.
చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్, ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది
డబ్బుల్లేక అమ్మకు ఫిజియోథెరపీ ఆపేశారు: శ్రీసత్య ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment