బిగ్‌బాస్ సిరి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ రియాలిటీ షో ద్వారా ఈ ముద్దుగుమ్మ తెగ పాపులర్ అయిపోయింది. బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టిన సిరి 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. ఆమె ప్రియుడు శ్రీహాన్ తో కలిసి అనేకమైన వెబ్ సిరీస్‌ల్లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఇటీవల రిలీజైన షారుక్ ఖాన్ జవాన్‌లో సిరి హన్మంత్ కీలకపాత్రలో కనిపించింది. జవాన్‌లో అవకాశం రావడం పట్ల సిరి తొలిసారి స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిరి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
(ఇది చదవండి: మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా? )
జవాన్‌లో నటించేందుకు నాకు ఫోన్ రాగా.. మొదట ప్రాంక్ కాల్ అనుకుని కొట్టిపారేశానని తెలిపింది. అయితే ఆ తర్వాత మేనేజరు ఫోన్ చేసి చెప్పడంతో నిజమని తెలిసిందని సిరి హన్మంత్ వెల్లడించింది. షూటింగ్లో కోసం ముంబయి వెళ్లిన తొలిరోజే భయంతో ఏడ్చేశానని పేర్కొంది. సెట్స్ చూశాక కూడా నమ్మకం కలగలేదని.. ఇది షారుక్ సినిమానేనా అంటూ అక్కడ ప్రతి ఒక్కరినీ అడిగానని చెప్పారు. ముంబయి తనకు కొత్తకావడంతో.. తన ఫ్రెండ్ శ్రీహాన్ తోడుగా నిలిచారని పేర్కొన్నారు.
(ఇది చదవండి: హీరోయిన్ సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!)
సిరి మాట్లాడుతూ..' ఈ సినిమా సెలక్షన్‌కు ముందు అట్లీ నన్ను తెలుగు అమ్మాయి అనుకోలేదు. ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయినని అనుకున్నారు. ఓ డైలాగ్‌కు సెవెన్ టేక్స్ తీసుకోవడంతో నాపై గట్టిగా అరిచారు. దీంతో ఏడ్చేశా.' అని అన్నారు. కాగా.. అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో సిరి హన్మంత్ చిన్న పాత్రలో కనిపించారు.ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment