
Bigg Boss 5 Telugu, Siri Hanmanth Boyfriend Shrihan On Fire: యూట్యూబ్ స్టార్ శ్రీహాన్, సిరి హన్మంత్ ప్రేమికులన్న విషయం అందరికీ తెలిసిందే! సిరి బిగ్‌బాస్ షోకు వెళ్లడానికి ముందు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ సిరి హౌస్‌లో ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుందంటూ అనేక విమర్శలు వచ్చాయి. షణ్ముఖ్ వద్దంటున్నా హగ్గివ్వడం, అతడికి ముద్దులివ్వడాన్ని చాలామంది తప్పుపట్టారు. సిరి ఇలా దిగజారిపోయిందేంటని ఆమెను దుమ్మెత్తిపోశారు. తన క్యారెక్టర్‌ను కించపరుస్తూ నానామాటలు అన్నారు. కానీ శ్రీహాన్ మాత్రం నెచ్చెలికే అండగా నిలిచాడు. సిరి గురించి తనకు బాగా తెలుసని, తన మీద కొండంత నమ్మకం ఉందంటూ మాట్లాడాడు.
కానీ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చాలామంది సిరి క్యారెక్టర్‌ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఓట్ల కోసమే షణ్ముఖ్‌కు దగ్గరైందని, బిగ్‌బాస్ షోలో మనుగడ సాగించడానికే అతడి మీదపడుతోందని విమర్శించారు. కొందరైతే ఆమె వల్ల షణ్ను నెగెటివ్ అవుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లు చూసి తట్టుకోలేకపోయిన శ్రీహాన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. 'నన్ను ఎంతోమంది ఏవేవో అంటున్నా ఏ రోజూ నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే వాటివల్ల పేరెంట్స్ బ్లేమ్ అవ్వకూడదని ఆలోచించాను. కానీ ఈ రోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్‌షాట్ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని, ఒక అమ్మాయని కూడా చూడకుండా క్యారెక్టర్ బ్లేమ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. మీ అమ్మ గురించి నేను ఆగిపోయాను.'
'ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా సిరి వల్ల నెగెటివ్ అయ్యాడు అంటారేంటి? నెగెటివ్ అవ్వడం కాదు, ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక అతడు(షణ్ను) పిచ్చోడయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవ్వరితో కలవడు కాబట్టి! ఇక్కడ సిరి వేరేవాళ్లతో మాట్లాడినా తప్పే, డ్యాన్స్ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అని క్రియేట్ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ఇంకా ఎవరి దగ్గరకని వెళ్తుంది? ఫ్రెండ్ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్ అవుతుంటే వీళ్లు ఇచ్చే విలువ ఇదా?.. బిగ్‌బాస్ చివరి రోజుల్లో ఎందుకు ఈ నెగెటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఆగుతుంటే అనవసరంగా సిరి అనడం ఏంటి?' అని మండిపడ్డాడు.
మొత్తానికి శ్రీహాన్ ఇన్నాళ్లకు అటు ట్రోలర్స్‌కు ఇటు షణ్నుకు గట్టిగానే ఇచ్చిపడేశాడంటున్నారు నెటిజన్లు. అయితే ఇన్నాళ్లూ పెదవి విప్పకుండా మౌనంగా ఎందుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. అంటే సిరి టాప్ 5లో అడుగుపెట్టే సమయం కోసం ఎదురుచూసి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. అటు షణ్నుది మాత్రమే తప్పు లేదని సిరిది కూడా తప్పుందంటున్నారు మరికొందరు. అతడు ఎంత కంట్రోల్ చేస్తున్నా, ఆఖరికి ఆమె తల్లిని, బాయ్‌ఫ్రెండ్ అయిన మిమ్మల్ని కూడా అన్ని మాటలంటున్నా పట్టించుకోకుండా అతడి పక్కన వాలిపోవడం తప్పు కాదా? అని నిలదీస్తున్నారు. ఇదిలా వుంటే శ్రీహాన్ ఈ పోస్టులను కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం.
Finally #Shrihan said it..
— Suneetha (@suneethak7) December 15, 2021
But Y only after coming to Top 5 ??
Did he wait for it and saying now???
He could have done long before.....
Now everything he says seems like he waited for siri to reach top5 and saying it 🤷🏻♀️#BiggBossTelugu5 #Siri#TitleHunterVJSunny #Sunny pic.twitter.com/oA2jVCu02T
Comments
Please login to add a commentAdd a comment