
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత నాగార్జున శనివారం హౌస్‌మేట్స్‌ను ఉతికారేస్తే ఆదివారం మాత్రం వారితో ఫన్ గేమ్స్ ఆడిస్తూ కూల్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ వారం కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను ప్రస్తావిస్తూ వాయించేసిన నాగ్ నేడు మాత్రం వారితో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇప్పుడు ఆడబోయే గేమ్స్‌లో ఎవరైతే గెలుస్తారో వారికి బిగ్‌బాస్ షీల్డ్ సొంతమవుతుందని ఆఫర్ ఇచ్చాడు నాగ్. మీరు అడుగుతారో, బతిమాలుకుంటారో, అడుక్కుంటారో, దొంగతనం చేస్తారో అది మీ ఇష్టం.. కానీ గెలుపు కోసం ట్రై చేయమని చెప్తాడు.
మొదటి రౌండ్‌లో ఒక గుండ్రటి వలయంలో దిండ్లు పెట్టారు. వాటిని దక్కించుకున్న ఇంటిసభ్యులు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సన్నీ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే సన్నీ చెంప పగులుతుందని చెప్పంటూ శ్రీరామ్‌ను ఎంకరేజ్ చేశాడు. దీంతో సన్నీ బిత్తరముఖం వేశాడు. తర్వాతి రౌండ్‌లో నాగ్ చెప్పిన కలర్ ఉన్న వస్తువులను తీసుకురావాల్సి ఉండగా కిచెన్‌లోని సామానంతా పట్టుకొచ్చేశారు హౌస్‌మేట్స్. ఇక బంగారు కోడిపెట్టలోని ప్రభావతి అనే కోడిని నామినేషన్‌లో ఉన్నవారు తమను సేవ్ చేయమని బతిమాలుకుంటున్నారు. రవి బతిమాలేందుకు ప్రయత్నించడం స్టార్ట్ చేసేలోపే కుక్క అరిచిన సౌండ్ వినపడుతుంది.
నీ చెంప పగలగొట్టను అని ప్రియ రిక్వెస్ట్ చేయగా సింహం సౌండ్ వినబడింది. దీంతో షణ్ముఖ్.. ఏంటి సార్, నటరాజ్ మాస్టర్ వచ్చాడంటూ జోక్ పేల్చాడు. తర్వాత ఆడిన మ్యూజికల్ చెయిర్ గేమ్‌లో సిరి ఓడిపోయింది. నువ్వు షణ్నుకు అన్నం తినిపించు అన్నట్లుగా నాగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో సిరి.. ఇందమాదిరి ఒరు రాడ్ అంటూ నాగ్ తనకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడని చెప్పకనే చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment