Siri Boyfriend Srihan Letter: బిగ్‌బాస్-5 హౌస్‌లో ఎనిమిదోవారం నామినేషన్ ప్రక్రియ కాస్త ఎమోషనల్‌గా సాగింది. 50 రోజులుగా కుటుంబ సభ్యులకు దూరమైన కంటెస్టెంట్స్‌కి.. ఇంటి నుంచి లేఖలు వస్తే.. వాటితోనే నామినేషన్ ప్రక్రియను కొనసాగించాడు బిగ్‌బాస్. దీంతో ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత అయిన వాళ్ళ దగ్గర నుండి వచ్చిన లేఖలు కళ్ళ ముందు చినిగిపోతుంటే వారిలోని దుఃఖం ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది.
(చదవండి: నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి)
మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో భార్య వద్ద నుంచి వచ్చిన లేఖను త్యాగం చేసి.. ప్రియాంకకు ఇచ్చాడు.. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. సిరి చేసిన త్యాగానికి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా సిరి కోసం ప్రియుడు శ్రీహాన్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘హాయ్ సిరి మన ఏడేళ్ల రిలేషన్‌లో ఇన్ని రోజులు దూరంగా ఉంటామని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా పక్కన లేకపోయినా మన లవ్‌ను ఫీల్ అవుతున్నాను. మా అమ్మ నాన్న తర్వాత నా గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు.కానీ నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా. హ్యాపీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు బయటకు వచ్చాక పెళ్లిచేసుకొని జీవితాంతం కలిసుందాం’అంటూ శ్రీహాన్ తన ప్రేమలేఖను సిరికి అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment