
Bigg Boss Telugu 5, Finalist Siri Hanmanth Remuneration: పటాకా ఆఫ్ ద బిగ్‌బాస్ హౌస్ ఎవరు అంటే అందరూ టపీమని సిరి అని చెప్తారు. ఆఖరికి బిగ్‌బాసే స్వయంగా చెప్పాడు. ఈ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరివి నీవంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపించాడు. ఈ సీజన్‌లో 15 వారాలు ఉండటమే కాక టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్‌గా సిరి చరిత్ర సృష్టించింది. ఫినాలేలో లేడీ కంటెస్టెంట్ ఉండటం ఇక కలే అనుకుంటున్న తరుణంలో రాకెట్‌లా దూసుకొచ్చింది సిరి.
గొడవైనా, ప్రేమైనా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి మరీ ఆడింది ఈ పటాకా. కాకపోతే ఎక్కువగా ప్రేమను షణ్ముఖ్‌కు, కోపాన్ని సన్నీకి పంచిపెట్టింది. గ్రాండ్ ఫినాలేలో ఐదో స్థానంలో ఉండగానే ఎలిమినేట్ అయిన సిరికి బిగ్‌బాస్ నుంచి ఎంత ముట్టిందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌తో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల మేర ఇస్తామని ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సిరి పదిహేను వారాలకు గానూ సుమారు పాతిక లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు లెక్క! ట్రోఫీ గెలవకపోయినా అందులో సగం మేరకైతే సంపాదించి బయటకొచ్చింది సిరి.
Comments
Please login to add a commentAdd a comment