
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం ఫైట్ నడుస్తోంది. ఇంటిసభ్యులను విలన్స్, హీరోస్ అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు బిగ్‌బాస్. రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ విలన్స్ టీమ్‌లో ఉండగా మిగిలినవారంతా హీరోస్ టీమ్‌లో ఉన్నారు. విలన్స్ టీమ్ వాళ్లను ఎమోషనల్‌గా దెబ్బ తీయాలని ప్లానులు రచిస్తున్నాడు బ్రహ్మ అలియాస్ షణ్ముఖ్. దీన్ని వెంటనే అమల్లో పెట్టాడు శ్రీరామ్. తన జుట్టు తీసేయబోతున్న జెస్సీతో అతడి కోసం తన లెటర్‌ను త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు.
మరోవైపు గేమ్‌లో ప్రియాంక ఎవరి మీదో బాగానే ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సిరి.. తనను నిర్దాక్షిణ్యంగా తోసేశారంటూ గగ్గోలు పెట్టింది. అయితే షణ్ను మాత్రం ఊరికే అన్నింటికి కంప్లైంట్ చేయకు, నువ్వు చేసింది కూడా మాట్లాడు అని కౌంటరివ్వడం గమనార్హం. ఇక ఈ వారం కెప్టెన్ షణ్ను మినహా మిగిలిన 10 మంది నామినేషన్‌లోకి వచ్చారు. కానీ వారిలో ఇద్దరు మానస్, యానీ సూపర్ పవర్స్ సాయంతో సేవ్ అయ్యారు. దీంతో ఈ వారం 8 మంది నామినేషన్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment