
Bigg Boss Telugu 5 Promo-Captaincy Task Fight Between Kajal and Sunny: ఈసారి కెప్టెన్సీ టాస్క్‌ను భిన్నంగా నిర్వహిస్తున్నాడు బిగ్‌బాస్. హౌస్‌నంతా లాక్‌డౌన్‌లో పెట్టి కంటెస్టెంట్లను బయటే ఉండాలని ఆదేశించాడు. తను ఇచ్చే టాస్కుల్లో గెలుపొందినవారు మాత్రమే ఇంటి లోపలికి వెళ్లేందకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు ఛాలెంజ్‌లు పూర్తి కాగా వాటిలో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ విజయం సాధించారు.
నేడు జరగబోయే మరో రెండు ఛాలెంజ్‌లలో సన్నీ, యానీ మాస్టర్ గెలిచినట్లు సమాచారం. అయితే ఈ ఐదుగురితో పాటు ఇంకో కంటెస్టెంట్ కూడా కెప్టెన్సీకి పోటీపడేందుకు స్పెషల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఓ సర్కిల్ మధ్యలో బంతిని పెట్టి దాన్ని ముందుగా అందుకున్నవాళ్లు కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారని ప్రకటించాడు. ఈ గేమ్‌లో మానస్ గెలుపొందినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు షణ్ను, సిరి మరోసారి గొడవపడ్డారు. దీంతో ఎప్పటిలాగే సిరికి సారీ చెప్పాడు షణ్ను. అయితే అప్పటికే అలకమంచం ఎక్కిన సిరి.. నాకొద్దు నీ సారీ అంటూ బుంగమూతి పెట్టుకుంది. సారీ చెప్పాను కదా, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్? అని షణ్ను అనడంతో మండిపోయిన సిరి.. ఎవడిక్కావాలి నీ సారీ అంటూ ఫైర్ అయింది. సడన్‌గా ఏమైంది? అని శ్రీరామ్ ఉలిక్కిపడగా ఇదంతా మాకు మామూలే అంటూ ఓ లుక్కిచ్చాడు షణ్ను.
Comments
Please login to add a commentAdd a comment