
ఇప్పటివరకు బిగ్‌బాస్ షో చాలామందికి లైఫ్ ఇవ్వడాన్ని చూశాం.. కానీ తొలిసారిగా రెండు జంటల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గత నెలలో ముగిసింది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు జెస్సీ, శ్వేత, లోబో, యానీ మాస్టర్ ఇలా ఎంతోమందికి మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ బోలెడంత పాపులారిటీతో హౌస్‌లో అడుగుపెట్టిన యాంకర్ రవి ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని బయటకు వచ్చాడు. అలాగే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ నెగెటివిటీని మూటగట్టుకోవడమే కాక ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికాడు. అటు సిరి హన్మంత్ లవ్ లైఫ్ కూడా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తోంది.
శ్రీహాన్‌తో నిశ్చితార్థం తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన సిరి, షణ్నుతో క్లోజ్‌గా ఉండటం, ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాననంటూ పదేపదే అతడికి హగ్గులివ్వడం చాలామందికి నచ్చలేదు. తప్పని తెలిసినా అతడితో క్లోజ్‌గా మూవ్ అవడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. సిరి వైఖరితో కలత చెందిన శ్రీహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలను డిలీట్ చేశాడు. కేవలం వారిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ఫొటోలను మాత్రం అలాగే ఉంచాడు. దీంతో వీరిద్దరు కూడా త్వరలోనే విడిపోనున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉంటే త్వరలోనే శ్రీహాన్ బిగ్‌బాస్ షోలో కనిపించనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఓటీటీకి శ్రీహాన్‌ను తీసుకురావాలన్న ప్లాన్‌లో ఉన్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. ఇప్పటికే సిరి వ్యవహారంతో బాధలో ఉన్న శ్రీహాన్ ఈ రియాలిటీ షోకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం! కానీ ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే మాత్రం షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment