
Siri Hanmanth Boyfriend Srihan In Bigg Boss Season 6 Telugu: మొన్నటిదాకా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సందడి చేసింది. ఇప్పుడు బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 6 అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన లోగో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సీజన్‌లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరబ్బా అనే ముచ్చట జోరుగా నడుస్తోంది. అయితే వీరిలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు శ్రీహాన్. నిజానికి బిగ్‌బాస్ ఓటీటీ మొదటి సీజన్‌లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బిగ్‌బాస్ బుల్లితెర ఐదో సీజన్‌లో సిరి, షణ్ముఖ్ ట్రాక్ వారిపై నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఈ నెగెటివిటీ శ్రీహాన్‌కు కలిసొచ్చింది.
అంతేకాకుండా బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్ మాట్లాడిన మాటలు, పాడిన పాట అందరిని ఆకట్టుకున్నాయి. సిరి, షణ్ముఖ్‌పై వచ్చిన ట్రోలింగ్‌తో బాధపడిన శ్రీహాన్ తన మాటలు, పాట రూపంలో చూపించి బీభత్సమైన పాజిటివిటీని సంపాదించుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు బిగ్‌బాస్ ఓటీటీ అవకాశం వచ్చిన దాన్ని తిరస్కరించాడని సమాచారం. అయితే తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6లో శ్రీహాన్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో శ్రీహాన్ పాల్గొంటే కచ్చితంగా టైటిల్ రేస్‌లో ముందుంటాడని చాలా మంది భావిస్తున్నారట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సీజన్ 6కు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ సమంత రానుందన్న వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
చదవండి: అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్, బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత?
Comments
Please login to add a commentAdd a comment