Bigg Boss Telugu 5 Promo: బుల్లితెర బాస్ బిగ్‌బాస్ షో ఏడోవారం ముగింపుకు చేరుకుంది. ఈ వారం జరిగిన కొట్లాటలను పంచాయితీ పెట్టి తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యాడు కింగ్ నాగ్. ముందుగా రవిని నిల్చోబెట్టి వాయించాడు. సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేశావని చెప్పగా రవి తాను దొంగతనం చేయలేదని, అవి దొరికాయని చెప్పాడు. నిన్నటివరకు స్టిక్కర్స్ దొంగిలించలేదంటూ బుకాయించిన రవి.. నాగ్ మాటలతో అడ్డంగా దొరికిపోయాడు. ఇక పదేపదే చెంప పగలగొడతానంటూ ఆవేశంతో ఊగిపోయిన ప్రియను అదే మాట ఎన్నిసార్లు అంటావని ప్రశ్నించాడు. అంతేకాకుండా కొట్టడానికి ఏకంగా పక్కనున్న పూలతొట్టి కూడా తీసుకున్నావని అడిగాడు. అది తాను చూడలేదని సన్నీ అనగా.. చూసినా ఏం చేయలేవులే అని నాగ్ పరువు తీసేశాడు.
ఇక సన్నీ కెప్టెన్ అయ్యేందుకు కీలక పాత్ర వహించిన యానీ మాస్టర్ కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన పొరపాటును లేవనెత్తింది. అది ఇండివిడ్యువల్ టాస్క్ అని రాసి ఉన్నా కూడా సన్నీ, కాజల్ కలిసి ఆడారు. అది నాకు డిస్టర్బ్‌గా అనిపించిందంటూ ఎమోషనల్ అయింది. ఆమె చెప్పింది కరెక్టే అనుకున్న నాగ్ వ్యక్తిగత గేమ్‌లో గ్రూప్‌గా కలిసి ఆడినందుకు సన్నీ కెప్టెన్సీ రద్దయిందని ప్రకటించాడు. మరి నాగ్ నిజంగానే సన్నీ ఆనందానికి నాగ్ అడ్డుపుల్ల వేశాడా? లేదా ఇంకోసారి ఇలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించాడా? అన్నది ఎపిసోడ్‌లో తేలనుంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాత్రం కెప్టెన్సీ రద్దు చేసే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment