Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ ఇంట్లో హింసకు తావు లేదు అన్న నియమాన్ని తుంగలో తొక్కారు హౌస్‌మేట్స్. నామినేషన్స్‌లో బూతులు మాట్లాడుతూ, రంగు పూయమంటే ఏకంగా చెంప పగలగొడుతూ, టాస్క్‌లో ఒకరినొకరు తన్నుకుంటూ గుద్దుకుంటూ, కిందా మీదా పడుతూ నానా రభస చేశారు. రెండో వారానికే ఈ రేంజ్ కొట్లాటలేంట్రా బాబూ అని జనాలు ముక్కున వేలేసుకున్నారు. అయితే కంటెస్టెంట్ల తిక్క కుదర్చడానికి వీకెండ్ ఎపిసోడ్‌కు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఆటలు బానే ఆడారు, కానీ బిహేవియర్ బాలేదని తిట్టిపోశాడు. రెండో వారం నామినేషన్స్‌లో హమీదాను కొట్టినంత పని చేసిన శ్వేత ప్రవర్తనను నిలదీశాడు నాగ్. దీంతో ఆమె అందరి ముందే రెండు చేతులతో చెంపలు పగలగొట్టుకుంది.
అనంతరం వీజే సన్నీ మీద ప్రశ్నల వర్షం కురిపించాడు నాగ్. సిరి డ్రెస్ లోపలున్న క్లాత్ ఎవరు తీశారు? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ క్వశ్చన్ ఎదురవుతుందని ముందే ఊహించిన సన్నీ.. తానసలు టచ్ చేయలేదని మరోసారి తేల్చి చెప్పాడు. దీంతో ఇదే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు షణ్ముఖ్‌ను అడగ్గా అతడు నిస్సంకోచంగా సన్నీ పేరు చెప్పాడు. దీంతో నాగ్ ఎవరిది అబద్ధం? ఎవరిది నిజం? అనేది అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించనున్నట్లు తెలుస్తోంది. మరి సన్నీ నిజంగానే సిరి షర్ట్ లోపల చేయి పెట్టాడా? లేదా అనవసరంగా సిరి అతడి మీద నిందలు వేసి అభాసుపాలు చేసిందా? అన్నది నేటి ఎపిసోడ్‌లో తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment