
ప్రత్యేక యాసతో ఉన్నదున్నట్లు మాట్లాడే సరయూ గురించి యూట్యూబ్ వీక్షకులకు తెలిసే ఉంటుంది. తను 7 ఆర్ట్స్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌కు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. బోల్డ్ వీడియోలు చేసే సరయూ తన మాటలు, బిహేవియర్‌తో హౌస్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పదమూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయూ బిగ్‌బాస్‌నే కాదు, లోపల కంటెస్టెంట్లను కూడా దమ్‌దమ్ చేస్తానంటొంది. కాగా ఒక్కసారైనా అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్లాలని చిన్నప్పుడు తరచూ అనుకునేదాన్నని, ఇప్పుడా కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. మరి సరయూ దూకుడును, ఆమె వాగ్ధాటిని తోటి కంటెస్టెంట్లు తట్టుకుని నిలబడతారా? అన్నది డౌటానుమానంగానే ఉంది.