
బిగ్‌బాస్ హౌస్‌లో పవర్ రూమ్‌లో అడుగుపెట్టిన విశ్వ, మానస్, సిరి, హమీదా కెప్టెన్సీ కోసం పోటీకి దిగారు. వీరికి బిగ్‌బాస్ సైకిల్ తొక్కే టాస్క్ ఇచ్చాడు. ఇందులో మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చినవారికి సపోర్ట్ చేస్తూనే అవతలివాళ్లు టాస్క్ గెలవకుండా ఆటంకం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్సీ పోటీదారుల కన్నా ముందు వారికి మద్దతునిస్తున్న హౌస్‌మేట్స్ మధ్యలో గొడవలు మొదలైనట్లు కనిపిస్తోంది. సరయూ తన దోస్త్ విశ్వకు సపోర్ట్ చేస్తుంటే కాజల్ మాత్రం అతడు గెలవకుండా అడ్డుపడినట్లు ప్రోమోలో స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఎందుకు ఒక్కడినే టార్గెట్ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. దీనికి కాజల్ సమాధానమిస్తూ.. అతడు కెప్టెన్ అయ్యేందుకు అర్హుడు కాదని చెప్పుకొచ్చింది. మరోవైపు సన్నీ, రవి మధ్య కూడా వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. రెండో రోజు మంచిగా ఉండి, నాలుగో రోజుకే గ్రూప్స్ ఎలా అవుతాయని సరయూ ఏడ్చేసింది. ఇంతకీ రవికి, సన్నీకి మధ్య జరిగిన గొడవేంటి? విశ్వను టార్గెట్ చేసిన కాజల్ ఎవరికి సపోర్ట్ చేసింది? కెప్టెన్ ఎంపిక సజావుగానే సాగిందా? అన్న విషయాలకు సమాధానం దొరకాలంటే గురువారం నాటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!