7 ఆర్ట్స్ సరయూ.. యూట్యూబ్‌లో అడల్ట్ కామెడీతో వీడియోలు చేసే ఈవిడ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తోటి కంటెస్టెంట్లనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌నే దమ్‌దమ్ చేస్తానంటూ ఐదో సీజన్‌లో అడుగు పెట్టిందీ భామ. షో ప్రారంభం రోజే నాగ్ ఎదుట పచ్చి బూతులు మాట్లాడి తనేంటో బొమ్మ చూపించేసింది. స్టేజీ మీదే ఆ రేంజ్‌లో బూతులతో చెలరేగిపోయిన సరయూ హౌస్‌లో ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో అనుకున్నారు నెటిజన్లు. కానీ తన బూతు పురాణాన్ని భరించడం ప్రేక్షకుల వల్ల కాదనుకుందో ఏమో కానీ కొంత సైలెంట్‌గానే ఉంది.
అప్పుడప్పుడు కొన్ని శాంపిల్స్‌ను వదిలినప్పటికీ అసలు విశ్వరూపం మాత్రం చూపించలేదు. అయితే నాగ్‌కు మాత్రం ఆమె అలా గమ్మున కూర్చోవడం అస్సలు నచ్చలేదు. శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగ్ సరయూను బూతులు మాట్లాడటం లేదేంటి? అని ప్రశ్నించాడు. మీరు తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానని సమాధానమిచ్చిన సరయూ... లేదంటే రెచ్చిపోయేదాన్నని చెప్పకనే చెప్పింది.
దీంతో నాగ్.. నువ్వు నీలా ఉండని చెప్తూ ఆమె స్వేచ్ఛగా బూతులు మాట్లాడొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే చాన్స్ అనుకున్న సరయూ మీరు డేట్‌కు తీసుకు వెళ్తానంటే బూతులు మొదలుపెడతా అని ఆఫరిచ్చింది. దీంతో నాగ్ నిన్ను డేట్‌కు తీసుకెళ్లాలంటే ముందు బయటకు రావాలి కదా! అని ఉన్నమాట చెప్పాడు. అప్పుడు సరయూ.. ఇప్పుడు కాదులే సర్, వంద రోజుల తర్వాత డేట్‌కు వెళ్దాం అని ఆశగా అడిగింది. దీనికి నాగ్‌కు కూడా వంద రోజుల తరువాతా.. అయితే ఓకే అని పచ్చజెండా ఊపడంతో సరయూ ఎగిరి గంతేసింది. ఈ డేటింగ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment