బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, ‘7ఆర్ట్స్’ సరయుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి చేసిన ఫిర్యాదు మేరకు గతంలో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సరయు, ఆమె టీమ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే సరయు ఈ కేసు గురించి వివరణ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'నేను గిప్పనిస్తా అనే షార్ట్ ఫిలింలో నేను నటించాను. అందులో 7 ఆర్ట్స్‌కు సిరిసిల్లలో ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్ అయింది. ఈ బిర్యానీ ప్రమోషన్‌లో గణపతి బప్పా రిబ్బన్ కట్టుకుని మందు తాగాం. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అలా చేయలేదు. విజయ్ సేతుపతి సినిమాలో నుంచి ఒక సీన్‌ను రిఫరెన్స్‌గా తీసుకునే అలా చేశాం. కానీ సిరిసిల్లలో విశ్వ హిందూ పరిషత్ వాళ్లకు అది నచ్చలేదు. ఇందులో సీన్ మా మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం చెప్పడంతో ఆ సీన్ తీసేశాం. తర్వాత బిర్యానీ పాయింట్ ఓపెన్ చేశాం.'
'అంతా అయిపోయిందనుకుంటుంటే ఏడాది తర్వాత ఆ కేసును బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. పోలీస్ ఎంక్వైరీ కోసం వెళ్లివచ్చాం కూడా! మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించామంటున్నారు కానీ అది జరగలేదు. ఒక నటిగా దర్శకుడు ఏది చెప్తే అది చేసి వెళ్తాను. నేనూ ఒక హిందువును, నాది హిందూ కుటుంబం. నా మతం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సహించను.. ఒక హిందూ అమ్మాయిగా హిందువుల మనోభావాలను కించపరచను. మీ మనోభావాలు దెబ్బ తినుంటే సారీ' అని క్షమాపణలు చెప్పింది సరయు.
Comments
Please login to add a commentAdd a comment