
వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన సరయూ వారం రోజులకే వెనుదిరిగింది. బయట అందరినీ గడగడలాడించే ఆమె హౌస్‌లో ఎక్కువరోజులు ఉండలేకపోయింది. మొదటివారంలోనే నామినేషన్‌లో నిలిచి తక్కువ ఓట్లతో హౌస్ నుంచి నిష్క్రమించింది. కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికిన సరయూ స్టేజీ మీదకు వచ్చాక మాత్రం పూనకంతో ఊగిపోతూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది.
తను నా బెస్ట్‌ఫ్రెండ్, కానీ నిర్లక్ష్యం చేశా..
హౌస్‌లో 5 బెస్ట్, 5 వరస్ట్ హౌస్‌మేట్స్ ఎవరో చెప్పమంటూ సరయూతో గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా ఐదురుగు బెస్ట్ కంటెస్టెంట్ట గురించి చెప్తూ సరయూ ఎమోషనల్ అయింది. శ్వేత స్వచ్ఛమైనదని, మానస్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడని, ప్రియాంకను ఎక్కువగా మిస్ అవుతాను అని చెప్పింది. విశ్వ ఇంట్లో అన్ని పనులు చేస్తాడని, పొద్దున్నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తాడు, కానీ అస్సలు అలిసిపోడు అంది. హమీద తన బెస్ట్ ఫ్రెండ్ అని, కానీ ఆమెనే ఎక్కువగా నిర్లక్ష్యం చేశానని బాధపడింది.
అక్కడ ఆయన ఇగో హర్ట్ అయింది..
వరస్ట్ కంటెస్టెంట్లుగా సిరి, షణ్ముఖ్, లహరి, సన్నీ, కాజల్‌ను ఎంచుకున్న సరయూ వాళ్ల గురించి చెప్తూ శివాలెత్తింది. చాలామంది హౌస్‌మేట్స్ ముందు ఒకలా, వెనక మరోలా ఉంటున్నారని ఆరోపించింది. సిరి, షణ్ముఖ్ ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది. ఆ తర్వాత సన్నీ గురించి చెప్తూ.. గతంలో ఆయనతో ఓ సినిమా చేశాను, అక్కడ జరిగిన చిన్న సంఘటనతో ఆయన ఇగో హర్ట్ అయింది. అప్పటి నుంచి తను నామీద పగ పెంచుకున్నాడని నొక్కి చెప్పింది.
అంత ఈగో ఏంటి? టోన్ మార్చుకో!
అయితే అలాంటిదేమీ లేదని సన్నీ చెప్తుండగా మధ్యలో అడ్డుపడిన సరయూ.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్‌గా నువ్వు నా మీద కోపం పెంచుకున్నావని తెలుసు అంటూ ఊగిపోయింది. అనంతరం లహరిని ఓ రేంజ్‌లో ఆడుకుంది. 'ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి? ఆ టోన్ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు' అని గట్టిగానే ఇచ్చిపడేసింది. తర్వాత షణ్ముఖ్ గురించి చెప్తూ.. అరేయ్ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా! అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇక కాజల్‌ను కూడా వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment