హిందూ క్యాలెండర్‌లో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఏడాదికి 12 సార్లు వస్తుంది. ప్రతి పౌర్ణమికీ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు పవిత్ర నదులలో స్నానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
ఈసారి జ్యేష్ఠ పౌర్ణమి తిథి జూన్ 21న ఉదయం 6:01కి మొదలై జూన్ 22 ఉదయం 5:07 వరకూ ఉంది. ఈ సందర్భంగా అయోధ్యకు చేరుకున్న లక్షలాదిమంది భక్తులు సరయూ నదిలో స్నానాలు చేస్తున్నారు. ఈరోజు సరయూ జయంతి నిర్వహిస్తున్నారు. సరయూ నది ఈ రోజునే భూమిపైకి వచ్చిందని చెబుతారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా స్థానిక అధికారులు సరయూ ఘాట్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment