
Bigg Boss Telugu 5, Sarayu Remuneration: వంద రోజులుంటానని కొండంత ఆశతో బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టింది యూట్యూబర్ సరయూ. కానీ టైం బాగోలేక వారానికే ఇంటి బాట పట్టింది. అయితే ఆమెకు తనను తాను నిరూపించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదన్నది అభిమానుల వాదన! అంతేకాదు, నామినేషన్‌లో ఉన్న హమీదాకు సరయూ కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమెను లవ్ ట్రాకుల కోసం షోలో ఉంచారని, సరయూను బలి చేశారని వాదిస్తున్నారు.
ఇదిలావుంటే బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన సరయూ కంటెస్టెంట్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలామంది ఇంకా ముసుగులు వేసుకునే ఆడుతున్నారని చెప్పింది. షణ్ముఖ్, సరయూ.. బయటే అంతా ఫిక్స్ చేసుకుని హౌస్‌లో అడుగుపెట్టారని ఆరోపించింది. సిరి మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని, వీజే సన్నీ తన మీద పగ పెంచుకున్నాడంటూ బిగ్‌బాస్ బజ్ ప్రోగ్రామ్‌లో యాంకర్ అరియానా ముందే కంటెస్టెంట్ల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో సరయూ పారితోషికం గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. బిగ్‌బాస్ ఆమెకు 70 వేల నుంచి లక్ష రూపాయల మేరకు ముట్టజెప్పాడని సమాచారం. వారం రోజులకు గానూ ఈ మొత్తాన్ని సరయూకు అందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment