Sarayu Comments In Bigg Boss 5 Buzz: సెప్టెంబర్ 5న అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో మొదటి ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. అయితే మొదట్లో జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అంతా ఊహించినప్పటికీ చివర్లో ఊహించని విధంగా సరయూ పేరు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే సరయు ఎలిమినేట్ అయింది. కానీ వంద రోజులు ఉండాల్సిన తాను వారానికే బయటకు వచ్చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. లోపల కంటెస్టెంట్లు కొందరు ముసుగులు వేసుకుని సేఫ్ గేమ్ ఆడటం వల్ల తాను బయటకు వచ్చేశానని రగిలిపోయింది. ఆ ఆగ్రహాన్ని అంతటినీ బిగ్‌బాస్ బజ్‌లో హోస్ట్ అరియానా గ్లోరీ ముందు వెల్లగక్కింది. ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న ఒక్కో కంటెస్టెంటు బండారాన్నంతా బయటపెట్టింది.
ముందుగా హౌస్‌లో కెప్టెన్‌గా కొనసాగుతున్న సిరి హన్మంత్ గురించి చెప్తూ ఆమె మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని విమర్శించింది. యాంకర్ రవి.. మంచోడిలాగా నీతి సూత్రాలు బోధిస్తాడు, కానీ అతడి దగ్గర విషయమే లేదు అని పెదవి విరుస్తూ అతడి ఫొటోను విరగ్గొట్టింది. వీజే సన్నీకి అసలు క్యారెక్టరే లేదని తేల్చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అతడు విశ్వ ఒక్కడే అని చెప్పింది. ఇక షణ్ముఖ్ జశ్వంత్ మీద మరోసారి విరుచుకుపడింది సరయూ. 'నిజంగా నీలో దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే సింగిల్‌గా ఆడు.. లేదంటే గాజులేసుకుని మూలన కూర్చో.. అయినా నేను గాజులేసుకుని కూడా ఒక్కదాన్ని ఆడుతా, నువ్వు ఇంటికి వెళ్లి మూలన కూర్చో' అంటూ షణ్ముఖ్‌ను ఏకిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment