Bigg Boss 5 Telugu: Vishwa Eliminated From 9th Week Nominations - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: 9వ వారం స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అవుట్‌!

Published Sat, Nov 6 2021 7:55 PM | Last Updated on Sun, Nov 7 2021 9:58 AM

Bigg Boss Telugu 5: Vishwa Eliminated From BB 5 House - Sakshi

బుల్లితెర అభిమానులు ఎంతగానో ఇష్టపడే రియాలిటీ షో బిగ్‌బాస్‌. తమ అభిమాన తారలు స్క్రీన్‌ బయట ఎలా ఉంటారు? వాళ్ల ఇష్టాయిష్టాలేంటి? వాళ్ల లైఫ్‌లో ఏమైనా సీక్రెట్స్‌ ఉన్నాయా? భవిష్యత్తు కోసం ఏం ప్లాన్లు వేసుకుంటున్నారు? వంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే షో బిగ్‌బాస్‌. ఇక్కడ పాల్గొనే కంటెస్టెంట్లు తమ జీవితాలను తెరచిన పుస్తకంలా ప్రేక్షకుల ముందుంచుతారు. దీంతో అభిమాన తారల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఫ్యాన్స్‌కు బిగ్‌బాస్‌ ద్వారా నెరవేరుతుందన్న మాట!

అయితే తారలనే కాకుండా పెద్దగా పాపులర్‌ కానివారిని కూడా తీసుకువచ్చి వారి ఎదుగుదలకు బాటలు వేస్తుందీ గేమ్‌ షో. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్‌ 5 నడుస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎలిమినేట్‌ అయ్యారు. సరయూ, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేత, ప్రియ, లోబో వరుసగా వెళ్లిపోయారు. ఈ వారం సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్‌, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో జెస్సీ, విశ్వ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు మొదటి నుంచీ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎవరు ఎలిమినేట్‌ అయ్యారన్న విషయాన్ని ఎప్పటిలాగే లీకువీరులు సోషల్‌ మీడియాలో చాటింపు వేసేశారు. కండల వీరుడు విశ్వ హౌస్‌ను వీడనున్నట్లు పేర్కొన్నారు.

విశ్వ విషయానికి వస్తే అతడు గేమ్‌లో విశ్వరూపం చూపిస్తాడు. అతడు టాస్క్‌లో పాల్గొంటున్నాడంటే చాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడతాయి. విశ్వను ఓడించడం కష్టం అని ముందుగానే డిసైడ్‌ అయిపోతారు. ఎలిమినేట్‌ అయిన పలువురు కంటెస్టెంట్లు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆట ఒక్కటే ఉంటే సరిపోదు, ఆకట్టుకునే టాలెంట్‌ కూడా ఉండాలి. ప్రేక్షకులు తనకు ఓటేసేలా ఆకర్షించడంలో విశ్వ వెనకబడ్డాడు. దీంతో ఈ వారం అతడు ఎలిమినేట్‌ అయినట్లు తెలిస్తోంది. ఏదేమైనా బిగ్‌బాస్‌ ఒక స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ను కోల్పోయిందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement