
బిగ్‌బాస్ తప్పులో కాలేశాడు. సెకండ్ కెప్టెన్ ఎవరనేది తనంతట తానుగా లీక్ చేశాడు. అయితే విశ్వ కెప్టెన్ అయ్యాడనేది ఒక రోజు నుంచే ప్రచారం జరుగుతోంది అది వేరే విషయం. కానీ అదే నిజమంటూ ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశాడు బిగ్‌బాస్. నేడు రిలీజైన ఒక ప్రోమోలో లోబో, ఉమాదేవి పోటీపడి మరీ స్కిట్ చేస్తున్నారు. వీరి కామెడీని చూసి తట్టుకోలేకపోయిన కంటెస్టెంట్లు పడీపడీ నవ్వారు.
ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ నవ్వులను చూపించాడు. అందులో విశ్వ ఎడమచేతికి కెప్టెన్ బ్యాండ్ ఉంది. దీన్ని పసిగట్టిన నెటిజన్లు బిగ్‌బాస్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇదేందయ్యా.. నువ్వే లీక్ చేశావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరే లీక్ చేస్తే మరి మేమేం చేయాలి అని సెటైర్ వేస్తున్నారు లీకువీరులు. కంటెంట్ దొరికింది, వదిలేదే లేదు అంటూ బిగ్‌బాస్‌ను ఆడేసుకుంటున్నారు మీమర్స్.. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులను మీరూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment