
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ 9 వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారం సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో విశ్వ, కాజల్, జెస్సీలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. తాజాగా కండల వీరుడు విశ్వ హౌస్‌ను వీడనున్నట్లు వార్త లీకైంది. ఓ పక్క సూపర్ హీరో అని మెచ్చుకుంటూనే హౌస్‌మేట్స్ విశ్వను ఇంటి నుంచి పంపించివేస్తున్నారని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ విషయంపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ స్పందించారు. 'అందరికీ సూపర్ ఎగ్జయిట్‌మెంట్ ఉన్న వార్త.. హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది' అని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నటరాజ్ మాస్టర్‌ను ఏకిపారేస్తున్నారు. 'మరి నువ్వెందుకు నాలుగో వారంలోనే బయటకు వచ్చావు? అంటే తమరెన్ని పాపాలు చేశారో!', 'మీ పాపం నాలుగో వారంలోనే పండింది', 'నువ్వు విశ్వ ఆడినదాంట్లో సగం కూడా ఆడలేదు, పైగా పోజులు కొడుతున్నావ్', 'నీ సోది జంతువులకు చెప్పుకోపో' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment