Bigg Boss 5 Telugu: Vishwa Remuneration For BB5 Will Leave You In Shock - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: 9 వారాలకు విశ్వకు ఎంత ముట్టిందంటే?

Published Sun, Nov 7 2021 11:29 PM | Last Updated on Tue, Nov 9 2021 5:48 PM

Bigg Boss Telugu 5: Vishwa Remuneration For Bigg Boss Show - Sakshi

Bigg Boss Telugu 5, Eliminated Contestant Vishwa Remuneration: బిగ్‌బాస్‌ షో చూస్తుండగానే 9 వారం ముగింపుకు చేరుకుంది. ఇప్పటివరకు హౌస్‌లో నుంచి 8 మంది వెళ్లిపోయారు. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేతవర్మ, ప్రియ, లోబో ఉన్నారు. తాజాగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్ల లిస్టులో విశ్వ చేరడంతో ఈ సంఖ్య 9కి చేరింది. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న విశ్వ హౌస్‌ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బుల్లితెర అభిమానులకు సైతం షాకింగ్‌గా ఉంది.

ఏ టాస్క్‌ ఇచ్చినా తిరుగులేని ప్రదర్శన ఇచ్చే విశ్వ ఎలిమినేట్‌ అవడం ఏంటో అర్థం కాక బుర్రలు బద్ధలు కొట్టుకున్నారు హౌస్‌మేట్స్‌. అన్నింట్లో ది బెస్ట్‌ ఇచ్చి, రంగులు మార్చకుండా మొదటి నుంచి ఒకేలా ఉన్న వ్యక్తిని ఎలా ఎలిమినేట్‌ చేస్తారని యానీ తల పట్టుకుంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు సైతం స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ను పంపించేసి ఇంకేం గేమ్‌ ఆడతారని పెదవి విరుస్తున్నారు.

అసలు బిగ్‌బాస్‌ వల్ల విశ్వ ఏమైనా లాభపడ్డాడా? అని చర్చిస్తున్నారు. అసలే లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతడికి బిగ్‌బాస్‌ ఏమైనా ప్లస్‌ అయిందా? అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో విశ్వ రెమ్యునరేషన్‌ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతడికి వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఇస్తున్నారట! ఈ లెక్కన అతడు 9 వారాలకు గానూ 22 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement