
'వచ్చిన ప్రతీ అవకాశాన్ని నిచ్చెనగా చేసుకుని ఒక్కో మెట్టు ఎదగడం మొదలుపెట్టాను. ఉక్కులు కరిగించే నిప్పుల సెగను ఊపిరిగా చేసుకుని, కన్నీళ్లను కండలు చిందించే చెమటగా మార్చి నేను నడిచేదారి కూడా తలవంచి నన్ను ముందుకు నడిపేవరకు, నేను కన్న కల నిజమయ్యేవరకు ప్రయత్నిస్తూనే ఉంటా'నంటున్నాడు విశ్వ.
నాగార్జున నిర్మించిన యువ తన తొలి సీరియల్ అని, నాగచైతన్య ఫస్ట్ మూవీలోనూ నటించానని, అఖిల్ నేను కలిసి చదువుకున్నామని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పద్నాలుగో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన విశ్వ తన కండలతో యాపిల్‌ను నుజ్జునుజ్జు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. అక్కినేని ఫ్యామిలీలో అందరితోనూ పరిచయం ఉన్న ఈ బాడీ బిల్డర్, నటుడు హౌస్‌లో ఎలా ఉంటాడనేది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment