
19 మంది కంటెస్టెంట్లో ప్రారంభమైన బిగ్‌బాస్ ఐదో సీజన్ చేపల మార్కెట్‌గా కనిపిస్తోంది. పడుకునే చోట వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండగా, ఇక కిచెన్‌లో పనులు చేయడానికి నా వల్ల కాదంటే నా వల్ల కాదని బద్ధకిస్తున్నారు. ఇక మగ మహారాజులు జిమ్‌లో కండలు పెంచుకునేందుకు పెట్టిన శ్రద్ధ పని చేయడం మీద పెట్టడం లేదన్నది ఉమాదేవి ఆరోపణ.
అయితే చిందరవందరగా ఉన్న ఇంటిని చక్కదిద్దాలన్నా, ఎవరు ఏ పనులు చేయాలో నిర్ణయించాలన్నా హౌస్‌కు కెప్టెన్ ఉండి తీరాల్సిందే! కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ ఇప్పటికే శక్తి చూపరా డింభకా అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో విశ్వ, మానస్, సిరి, హమీదా గెలుపొందారు. నేటి ఎపిసోడ్‌లో ఈ నలుగురికీ ఓ టాస్క్ ఇచ్చి అందులో విజయం సాధించినవారిని కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించేందుకు ఆ నాలుగురూ తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. కానీ అందరినీ వెనక్కునెట్టి అల్లరి పిల్ల సిరి కెప్టెన్‌గా నియామకమైనట్లు తెలుస్తోంది. ఆమె కండలవీరుడు విశ్వను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కెప్టెన్ సిరి మిగతా హౌస్‌మేట్స్‌ను ఎలా దారిలో పెడుతుంది? అన్నది చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment