
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సీజన్ మొత్తానికి కెప్టెన్ కాలేరన్న ప్రియను బిగ్‌బాస్ ప్రత్యేక అధికారంతో కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. దీంతో ఎవరు చెత్త ఆటగాళ్లనుకుంటున్నారో వారిని బలిపీఠం ఎక్కించి ముఖం మీద నీళ్లు గుమ్మరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శ్వేత మాట్లాడుతూ.. 'నాకు, సన్నీ, యానీ మేడమ్‌కు మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది, అది టాస్క్ వల్ల ఎండ్ అయ్యేది కాదు. సో ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేయకండి' అని సూచిస్తూ కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక మరోసారి జెస్సీ, సిరి, షణ్ముఖ్ గ్యాంగ్‌కు శ్రీరామ్‌కు మధ్య రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. తాను వయొలెంట్‌గా ఉన్నానంటూ సిరి గ్యాంగ్ సభ్యులందరూ చేయెత్తడంతో శ్రీరామ్ ఖంగు తిన్నాడు. తర్వాత రవికి కాజల్‌కు మధ్య కూడా గట్టి ఫైట్ నడిచినట్లు కనిపించింది. ఎవరి మీదా చేయెత్తొద్దు అంటూ కాజల్‌కు నీతి వాఖ్యాలు బోధించాడు రవి. చివర్లో యానీ మాస్టర్ ఎవరి ముఖం మీదా నీళ్లు గుమ్మరించలేక తన ఫేస్ మీద తానే నీళ్లు చల్లుకోవడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారమైతే ఈవారం కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకు వెళ్లినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment