
Bigg Boss Telugu 5, 10th Week Elimination: స్ట్రాటజీకీ మారుపేరు ఆర్జే కాజల్. తను ఏం చేసినా, చేయకపోయినా అన్నింటికీ స్ట్రాటజీ అని పేరు పెడుతుంది. బిగ్‌బాస్ హౌస్‌లో రిలేషన్స్‌కు చోటు లేదంటూ ఎమోషన్స్ పక్కన పెట్టి మరీ ఆడింది. మొదట్లో కాజల్ ఆటను చూసిన హౌస్‌మేట్స్ ఆమెను ఎదుర్కోవాలంటే ఒక అడుగు వెనక్కు వేసేవారు. ఎప్పుడు ఏ పాయింట్ పట్టుకుని లాగుతుందోనని చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. కానీ రానురానూ కాజల్ వైఖరిలో మార్పు వచ్చింది. తను కూడా తోటి కంటెస్టెంట్లతో ఫ్రెండ్‌షిప్ బాండ్ పెంచుకుంది. ఇంటి నుంచి పంపిన లెటర్ తనకు దక్కకుండా పోతుందేమో అనుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. ఫ్రెండ్స్ తనను పట్టించుకోనప్పుడూ అలిగి ఏడ్చింది. ఇవన్నీ కాజల్‌కూ ఓ మనసుందని నిరూపించాయి.
గేమ్ కోసం ఏదైనా చేసే కాజల్ గత కొంతకాలంగా ఆటలో వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. ఎవరి మాటలు నమ్మాలో? ఎవరు తనవైపు నిలబడుతున్నారో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్లిపోయింది. టాస్కుల్లోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇదే కారణాన్ని హౌస్‌మేట్స్ ప్రస్తావిస్తూ గత కొన్ని వారాలుగా కాజల్ హౌస్‌లో(గేమ్‌లో) కనిపించడం లేదంటూ రెండు సార్లు ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకుని జైలుకు పంపించారు. మరోవైపు ఈ వారం సిరి, రవి, సన్నీ, మానస్‌లతో పాటు కాజల్ కూడా నామినేషన్‌లో ఉంది.
వీరిలో రవి, సన్నీలు ఓటింగ్‌లో టాప్‌లో దూసుకుపోతున్నారు. మానస్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. మిగిలిందల్లా సిరి, కాజల్. షణ్ముఖ్ ఎలాగో నామినేషన్స్‌లో లేడు కాబట్టి అతడి ఓట్లు కూడా సిరికే పడుతున్నాయి. దీంతో ఆమె ఈ వారం సేవ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకైతే అనధికారిక పోల్స్‌లో కాజల్ తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉండటంతో ఈ వారం కాజల్ ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అవగా ఈ సండే కాజల్ వారి సరసన చేరనుందని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment