Bigg Boss 5 Telugu 12 Week Captaincy Task: Kajal Gets Emotional - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌-5: శ్రీరామ్‌ పిచ్చి ప్రశ్నలు.. బాత్‌రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్చిన కాజల్‌

Published Wed, Nov 24 2021 8:34 AM | Last Updated on Wed, Nov 24 2021 9:23 AM

Bigg Boss 5 Telugu: 12th week Captaincy Contender Task, Kajal Gets Emotional - Sakshi

Bigg Boss 5 Telugu 12 Week Captaincy Contender Task: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌ కోసం గార్డెన్‌ ఏరియాలో నియంత సింహాసనం ఏర్పాటు చేశారు. సైరన్‌ మోగిన ప్రతిసారి ఆ సింహాసనంలో  ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్‌ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్‌ వరకు వాళ్లు సేఫ్‌ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్‌ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. 


సన్నీకి హ్యాండిచ్చిన సిరి
తొలి రౌండ్‌లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో నియంత సిరిని మినహాయించి మిగిలిన ఇంటి సభ్యులకు ఒక చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో హుక్స్‌కి వేలాదదీయబడిన క్యాప్‌లను చేతితో తాకకుండా తలకు ధరించి.. పక్కనే ఉన్న హుక్స్‌కి పెట్టాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంత దగ్గరకు వెళ్లి తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న సిరి.. అందరు ఊహించినట్లే సన్నీని తొలగించి రవిని సేవ్‌ చేసింది. దీంతో బాగా హర్ట్‌ అయిన సన్నీ.. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని, ఫస్ట్‌ రౌండ్‌లోనే డిస్‌ క్వాలిఫై అయినందుకు బాధగా ఉందని షణ్ముఖ్‌ దగ్గర వాపోయాడు. 

బాత్‌రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్చిన కాజల్‌
ఇక రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఆరుగురికి మరో చాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో మానస్‌ అందరికంటే ఎత్తులు చెప్పులు అతికించగా.. రవి, కాజల్‌ తక్కువ ఎత్తులు చెప్పులు అతికించి నియంత శ్రీరామ్‌ని ఎదుర్కొన్నారు. అయితే నియంతగా ఉన్న శ్రీరామ్ కాజల్‌ని నెక్స్ట్ రౌండ్‌కి పంపడానికి ఇష్టపడలేదు. ‘నేను ఇంతవరకు కెప్టెన్‌ కాలేదు. ఇదే నాకు చివరి చాన్స్‌.. ఇప్పుడు నేను కెప్టెన్‌  కావాలనుకుంటున్నా’అని రిక్వెస్ట్‌ చేసినప్పటికీ... ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి డిస్‌క్వాలిపై చేశాడు. దీంతో బాగా హర్ట్‌ అయిన కాజల్‌.. ‘ఈ తొక్కలో డిస్కషన్స్ ఎందుకు రవికి ఇస్తానని ముందే చెప్పొచ్చుగా’అంటూ శ్రీరామ్‌పై సీరియస్‌ అయింది. కెప్టెన్‌ అయ్యే చివరి అవకాశం లేకుండా పోయిదంటూ.. బాత్‌ రూంలోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చింది. ప్రియాంక వెళ్లి ఆమెను ఓదార్చింది.
 

ఇక మూడో రౌండ్‌లో రవి నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిన సభ్యులకు ఆరెంజ్‌ టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో భాగంగా తలపై ఆరెంజ్‌లను పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరంలో ఉన్న బుట్టలో వేయాలి. ఈ టాస్క్‌లో మానస్‌, షణ్ముఖ్‌ చివరి స్థానాల్లో నిలిచి నియంత రవిని ఎదుర్కొన్నారు. ఇరు వాదనలు విన్న రవి.. అందరు ఊహించినట్లే షణ్ముఖ్‌ని సేవ్‌ చేశాడు. 

నాలుగో రౌండ్‌లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. మిగిలిన ఇంటి సభ్యులకు వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు. ఈ చాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంతను ఎదుర్కొన్నారు. ఇక్కడ ప్రియాంక చాలా తెలివిగా వ్యవహరించి శ్రీరామ్‌ని డిస్‌ క్వాలిఫై చేసింది. శ్రీరామ్‌ కూడా కెప్టెన్సీ టాస్క్‌ నుంచి వైదొలగడంతో కాజల్‌ పండగ చేసుకుంది. 

ఐదో రౌండ్‌లో భాగంగా.. నియంత సింహాసనంపై ఒకేసారి సిరి, ప్రియాంక కూర్చున్నారు. అయితే సిరి కంటే ముందుగా ప్రియాంకే కుర్చుదంటూ.. సిరిని కాదని పింకీకే అవకాశం ఇచ్చాడు. దీంతో సిరి చాలా ఎమోషనల్‌ అయింది. ఫస్ట్‌ నేనే కూర్చున్న వాళ్లు అబద్దాలు చెబుతున్నారంటే ఏడ్చేసింది. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏడుస్తారా? గేమ్ ఆడు.. నువ్ ఇంత వీక్ అయితే నా ఫ్రెండ్‌గా ఉండకు అని చెబుతూ సిరిని హెచ్చరించాడు షణ్ణ్ముఖ్‌. ప్రియాంకను గెలిపించాలని ఉంటే గెలిపించుకోండి కానీ.. అన్ ఫెయిర్ గేమ్ ఆడొద్దని వార్నింగ్‌ ఇచ్చింది సిరి. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో చివరి కెప్టెన్‌ ఎవరు అయ్యారో బుధవారం నాటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement