
Bigg Boss 5 Telugu, VJ Sunny Is New Captain: సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం ఒక ఎత్తయితే ఇక్కడ ఎక్కువ వారాలు ఉండి ఏదో ఒకటి సాధించడం మరో ఎత్తు. కొందరు ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఆడితే మరికొందరు మాత్రం ఉన్న కొద్ది వారాలైనా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే చాలని సంతోషిస్తారు. ఇక మరికొందరు టాప్ 5లో ఉంటే అదే పదివేలని భావిస్తారు.
ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఎవరు టాప్ 5లో ఉంటారని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వీరిలో మానస్, సన్నీ, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర ఫినాలే వరకు వెళ్తారని కొందరు అభిప్రాయపడుతుండగా, షణ్ముఖ్ గ్యాంగ్‌తోపాటు ప్రియాంక సింగ్, సన్నీ ట్రోఫీ కోసం పోటీ పడతారని మరికొందరు అంటున్నారు. అయితే వీరిలో సన్నీకి ట్రోఫీ సాధించడం కన్నా ముందు మరొక కల ఉంది. అదే కెప్టెన్ కావడం. కొన్ని వారాలుగా కెప్టెన్సీ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది.
అయితే ఎట్టకేలకు అతడి కోరిక నెరవేరినట్లు తెలుస్తోంది. తాజాగా హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ గెలిచినట్లు లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అతడు కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడట! ఇప్పటివరకు లీకువీరులు చెప్పిన ప్రతీది నిజమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సన్నీ కెప్టెన్ కావడం కూడా ఖాయమే అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి అతడి కల నెరవేరిందని, కెప్టెన్సీ కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న డ్రెస్ ధరించే సమయం వచ్చేసిందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment