
Bigg Boss 5 Telugu, 13th Week Elimination: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగులో విజయవంతంగా దూసుకుపోతోంది. నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపుకు చేరుకుంటోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం నువ్వా?నేనా? అన్న రీతిలో పోరాడుతున్నారు.
ఇదిలా వుంటే ఈ వారం షణ్ముఖ్, సన్నీ మినహా శ్రీరామ్, సిరి, మానస్, ప్రియాంక, కాజల్ నామినేషన్‌లో ఉన్నారు. ఎలాగో ఇందులో శ్రీరామ్ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో దూసుకుపోతున్నాడు. అటు మానస్ కూడా కేవలం గేమ్ మీదే ఫోకస్ పెట్టి ఆడుతూ తనకు మంచి ఓట్లు పడేలా జాగ్రత్తపడుతున్నాడు. మిగిలిందల్లా సిరి, కాజల్, ప్రియాంక. నిజానికి గతవారంలోనే వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు.
ఇక ఈ వారం దాదాపు ప్రియాంక హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలున్నాయి. లేదంటే కాజల్‌ను పంపించేందుకు ఆస్కారం ఉంది. సిరి టాప్ 5లో పాగా వేసే ఛాన్స్ ఉంది. కానీ మొన్నటి ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అభిమానులకు భయం పట్టుకుంది. ఎవరో ఒకరిని రక్షించడం కోసం మళ్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయరు కదా! అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వారం బిగ్‌బాస్ పింకీని పంపించేస్తాడా? లేదా వేరే ఆప్షన్ ఎంచుకుంటాడా? అన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment