బిగ్‌బాస్‌: కాజల్‌ కన్నింగ్‌ ప్లాన్‌.. ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్‌ | Bigg Boss 5 Telugu: Conflicts between Anee Master And Swetha, Priya Fries On Siri | Sakshi

Bigg Boss 5 Telugu: కాజల్‌ కన్నింగ్‌ ప్లాన్‌.. ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్‌

Published Thu, Oct 14 2021 12:02 AM | Last Updated on Thu, Oct 14 2021 10:53 AM

Bigg Boss 5 Telugu: Conflicts between Anee Master And Swetha, Priya Fries On Siri - Sakshi

Bigg Boss Telugu, Episode 39 Highlights: గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించిన విషయం తెలిసిందే.  దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్‌ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. దీంతో యాంకర్ రవి.. స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్‌ టీమ్‌  దగ్గర ఉన్న బొమ్మల్ని తీసేసుకున్నారు. దీంతో యానీ మాస్టర్‌ మరో ప్లాన్‌ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్‌ అయిన యానీ.. లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది.ఇక శ్వేతపై అరిచిన యానీమాస్టర్ తినడం మానేసింది. శ్వేత కూడా తినకుండా ఆగిపోయింది. దీంతో యానీ మాస్టర్.. రా తిందాం అని అడిగింది.

యాంకర్‌ రవిది క్రిమినల్‌ మైండ్‌: సన్నీ
రవి టీమ్‌కి వచ్చిన స్పెషల్‌ పవర్‌ కారణంగా అన్ని బొమ్మలను కోల్పోయిన బ్లూ కలర్‌ టీమ్‌ సభ్యులు( మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌).. చేసేదేమి లేక మూలన కూర్చొని బాధపడ్డారు. సన్నీ, మానస్‌ అయితే రవి గేమ్‌ ప్లాన్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 

అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారు.. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని సన్నీ అన్నాడు. ఇక మానస్‌ మాట్లాడుతూ.. ‘యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు.. రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు.. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది.. దాన్ని గుంజుకుని.. ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి తీసుకుందాం అనే ఆట ఆడారు’అన్నారు. 

ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్‌
అర్థరాత్రి తర్వాత మానస్‌ దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. కోపంగా ఉన్నావా? నీతో మాట్లాడొచ్చా అని అడిగింది. ఏం లేదు చెప్పు అన్నాడు మానస్‌. చెప్పాక తిట్టవు కదా అంది ప్రియాంక. తిట్టనులే చెప్పు అని మానస్‌ హామీ ఇవ్వడంతో.. టాస్క్‌ల్లో నేను వందశాతం ఎఫర్ట్ ఇస్తున్నానా? అని అడిగింది. హా ఇస్తున్నావ్ గా అని చెప్పాడు మానస్.

దీంతో ప్రియ.. ‘నువ్ అంటుంటావ్ కదా.. నేనొక బార్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని.. నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా? అని అడిగింది. అదేం లేదు.. ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నావ్ ఎందుకు? నేను బార్డర్ ఎందుకు పెడతా అంటే.. ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారని.. ప్రతి ఒక్క రిలేషన్‌లోనూ ఎక్స్ పర్టేషన్స్ ఉంటాయి.. అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా.. ఈ విషయం గురించి నన్ను పదే పదే అడిగి నువ్ ఇబ్బంది పడకు.. నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు మానస్. దీంతో ప్రియాంక్‌ ఎమోషనల్‌ అయి ఏడ్చేసింది. మానస్‌ వెళ్లి ఓదార్చాడు.

రవిని టార్గెట్‌ చేసిన కాజల్‌
తొలి నుంచి పక్కా ప్లాన్‌తో గేమ్‌ ఆడుతూ వస్తున్న కాజల్‌.. ఈ వారం ఎలాగైన కెప్టెన్‌ కావాలని ఫిక్స్‌ అయింది. తనకు పోటీ ఉండకూడదని రవిని తొలగించే ప్లాన్‌ వేసింది. సంచాలకురాలిగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి రవికి చెక్‌ పెట్టే ప్లాన్‌ వేసింది. గతంలో చెక్‌ చేసి ఓకే చెప్పిన బొమ్మలను కూడా మళ్లీ పరిశీలించాలని పట్టుపట్టింది. సంచాలకులదే తుది నిర్ణయం కావడంతో.. కాజల్‌ చెప్పినట్టుగానే అన్ని బొమ్మలను మళ్లీ తీసుకొచ్చింది రవీ టీమ్‌. వాటిలో కొన్ని బొమ్మలను రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి కాజల్‌ కన్నింగ్‌ ప్లాన్‌ను రవి ఎలా ఎదుర్కొన్నారో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement