ఆర్జే కాజల్.. అమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ వాగుడుకాయగా పేరు తెచ్చుకుంది కాజల్. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిన తొలినాళ్లో అందరితో గొడవలు పెట్టుకుని నెగెటివిటీ సంపాదించుకున్న ఆమె రానురానూ తన తప్పొప్పులు తెలుసుకుని తనను తాను మార్చుకోవడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. మానస్, సన్నీల దోస్తీ చేయడమే కాకుండా వారికోసం నాగార్జునను సైతం ఎదిరించే ధైర్యానికి అభిమానులు సలాం కొట్టారు. బిగ్‌బాస్ తర్వాత పలు షోలతో నిత్యం బిజీగా ఉంటున్న కాజల్ తాజాగా తన ఇల్లును చూపిస్తూ హోంటూర్ వీడియో చేసింది.
ఇల్లు సర్దలేనంటూనే తన గృహాన్ని చూపించింది. అనివార్య కారణాల వల్ల త్వరలోనే ఈ ఇంటిని వదిలేసి కొత్తింటికి మారిపోతున్నామని అందుకే హోం టూర్ వీడియో చేశానని చెప్పుకొచ్చింది. ఇంట్లో అడుగుపెట్టగానే మొదటగా స్కూల్ నుంచి కాలేజీ వరకు గెలుచుకున్న బహుమతులను చూపించింది కాజల్. అవన్నీ దాదాపు పాటలో పోటీలో విన్ అయిన బహుమతులేనని తెలిపింది. అలాగే షోలో గెల్చుకున్న గిఫ్ట్స్‌ను సైతం అందంగా అమర్చుకుంది. వరుసగా అమర్చిన పుస్తకాలను చూపిస్తూ ఫరియా అబ్దుల్లా తనకో పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిందని చెప్పింది.
హాల్, కిచెన్, పూజా గది, గెస్ట్ రూమ్, బాల్కనీతో పాటు తన సోదరి గదిని చూపించింది. ఆ తర్వాత గెస్ట్ రూమ్ ఉందని, అమ్మవాళ్లు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారంది. అలాగే ఏదైనా షోకు వెళ్లేముందు ఇక్కడే రెడీ అయ్యేదాన్నని చెప్పింది. తర్వాత తన గదిని చూపిస్తూ అక్కడ రెండు వార్డ్‌రోబ్‌లు ఉన్నాయని, అటాచ్‌డ్ బాల్కనీ ఉందని తెలిపింది. అయితే అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్ కాకుండా ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని చెప్పుకొచ్చింది కాజల్.
చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య!
Comments
Please login to add a commentAdd a comment