
సండే ఫండే అంటూనే నాగార్జున బిగ్‌బాస్ ఇంట్లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని హౌస్‌మేట్స్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. తొలుత సన్నీ తటపటాయిస్తూనే షణ్నును వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డాడు. మానస్ కూడా షణ్నునే వరస్ట్ అని పేర్కొన్నాడు. శ్రీరామ్ వరస్ట్ పర్ఫామర్ అన్న ట్యాగ్‌ను కాజల్‌కు ఇచ్చాడు. తర్వాత యానీ వంతు రాగా.. ఆమె ఎలాగో నేనే చెత్తగా ఆడానంటుందని మైండ్‌లో బలంగా ఫిక్సైన కాజల్.. ఈ ట్యాగ్ ఎందుకు తీయడం? నేనే ఉంచుకుంటానులేనని చెప్పుకొచ్చింది. దీంతో చిరాకుపడ్డ యానీ.. ఇదే సార్ ప్రాబ్లమ్ అంటూ నాగ్ ముందు ఇరిటేట్ అయింది.
అయితే యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డట్లు ప్రోమోలో తెలుస్తోంది. మొత్తానికి ఈ టాస్క్‌లో ఎక్కువమంది కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మరోసారి జైల్లో పడిందని సమాచారం! ఇక ఈ వారం గేమ్‌లో విశ్వరూపం చూపించే విశ్వ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే బిగ్‌బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను కోల్పోతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment