
Bigg Boss Telugu 5, Eliminated Contestant RJ Kajal Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో కాజల్ ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. మొదట్లో అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ వారి పర్సనల్స్ గురించి కూపీ లాగే ప్రయత్నం చేసినందుకుగానూ ఆమెను లేడీ నారదగా పేర్కొన్నారు. అందరితోనూ గొడవపడుతుంటే స్క్రీన్‌స్పేస్ కోసం డ్రామాలన్నారు. బిగ్‌బాస్ అనేది తన డ్రీమ్ అంటూ ప్రతి విషయానికి ఎగ్జైట్ అవడాన్ని సైతం అందరూ తప్పుపట్టారు. గేమ్‌లో తను వాడే స్ట్రాటజీలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా పట్టించుకునే ప్రసక్తే లేదన్నట్లుగా తనకు నచ్చినట్లుగా ఉంటూ వచ్చింది కాజల్.
జర్నీ సగం వరకు తనమీద వ్యతిరేకత పెరుగుతూ పోయినా ఆ తర్వాత సన్నీ, మానస్‌లతో కుదిరిన దోస్తీతో అది పటాపంచలైనట్లు కనిపించింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవడానికి రాలేదంటూనే తనకు తెలీకుండా వీళ్లిద్దరికీ బాగా క్లోజ్ అయింది కాజల్.. వాళ్ల కోసం ఎన్నోసార్లు స్టాండ్ తీసుకోవడమే కాక సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి ముఖ్య కారకురాలైంది. ఆ సమయంలో హౌస్ అంతా తనను తిట్టిపోస్తున్నా వెనక్కి తగ్గకుండా సన్నీకి పాస్ వచ్చేలా చేసింది. ఇక అప్పడం గొడవలో సన్నీని నాగార్జున సైతం విమర్శించినప్పటికీ సన్నీ తప్పు లేదంటూ అతడికి అండగా నిలబడింది. సన్నీ మీద నాగ్ ఫైర్ అవుతుండగా అతడి ఇంటెన్షన్ వేరంటూ హోస్ట్‌కే ఎదురు తిరిగింది.
అలా తనకు కనెక్ట్ అయినవారి కోసం ఏదైనా చేసే కాజల్ స్వభావం ఎంతోమందిని కట్టిపడేసింది. తన స్నేహితుడిని నిందితుడిగా ముద్ర వేయకుండా కాపాడటానికి ఏకంగా నాగార్జునతోనే వాదించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎవరేమంటున్నా, ఎన్ని గొడవలైనా చిరునవ్వుతో వాటిని స్వీకరించే మనసుకు ఎంతోమంది ఫిదా అయ్యారు. కానీ ఫ్యాన్ బేస్ తక్కువగా ఉండటం, నామినేషన్‌లో ఉన్నవారిలో తనకు తక్కువ ఓట్లు నమోదవడంతో 14వ వారం ఎలిమినేట్ అయింది కాజల్.
ఈ క్రమంలో బిగ్‌బాస్ నుంచి కాజల్‌కు ఎంత ముట్టిందన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్ చేశారట! అంటే 14 వారాలకుగానూ కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. తనకు రూ.30 లక్షల అప్పు ఉందన్న కాజల్ ఈ రెమ్యునరేషన్‌తో ఆ రుణభారాన్ని వదిలించుకునే అవకాశం ఉంది.