
Bigg Boss Telugu, 14th Week Elimination, Kajal Exit From BB5 Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షోలో హౌస్‌మేట్స్ ఎన్నోవారాలు నామినేషన్‌లో ఉన్నారు, ఎన్నోవారాలు ఎలిమినేషన్ చివరి అంచుల వరకు వచ్చి చివరి క్షణంలో సేవ్ అయ్యారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఈ ఒక్కవారం మాత్రం వారి తలరాతను మార్చనుంది. ఫినాలేకు పంపాలా? వద్దా? అని డిసైడ్ చేయనుంది.
ఈ పద్నాలుగో వారం మానస్, సిరి, షణ్ను, కాజల్, సన్నీ.. ఐదుగురూ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో షణ్ను, సన్నీ సేవ్ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షణ్ను కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయన్నారు కానీ అదంతా ఫేక్! షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయని సమాచారం.. మానస్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇక సిరి, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారని మొదటి నుంచీ అంతా అనుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న విషయం లీకైంది. కాజల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే టాప్ 5లో అడుగుపెట్టాలన్న ఆమె ఆశలు అడియాసలైనట్లు కనిపిస్తోంది. దోస్తులతో పాటు తాను కూడా ఫినాలేలో అడుగుపెట్టాలన్న కల నెరవేరకుండానే బిగ్‌బాస్ షో నుంచి నిష్క్రమించనుంది కాజల్. దీంతో ఆమె అభిమానులు ఈ ఎలిమినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిని కాపాడటానికే కాజల్‌ను పంపించివేస్తున్నారంటూ షోను దుమ్మెత్తిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment