
Bigg Boss Telugu 5, MLA Raja Singh Comments On Bigg Boss Show: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్‌బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలని, అసలు షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. రవిని ఎలిమినేట్ చేయడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. తెలంగాణ వ్యక్తిని బయటకు పంపించి మరోసారి కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు బిగ్‌బాస్‌తో పాటు హిందీ బిగ్‌బాస్‌ను సైతం బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని తెలిపారు.
కాగా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడే టాప్ 5 పక్కా అని అంతా డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా 12వ వారంలోనే అతడిని ఎలిమినేట్ చేసి పంపించేశారు. తనకంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లను హౌస్‌లో ఉంచి రవిని అన్యాయంగా ఆటలో నుంచి తొలగించారు. దీన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో తమ ఆవేశం వెల్లగక్కుతున్నారు. ఎవరినో సేవ్ చేయడం కోసం రవిని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment