
టిక్‌టాక్ బ్యాన్ కాకముందు ఆ యాప్ ద్వారా బాగా పాపులర్ అయిన వాళ్లలో దుర్గారావు ఒకరు. అతడు భార్యతో కలిసి చేసిన 'నాది నెక్కిలీసు గొలుసు' డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో ఒక్కరోజులోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో తరచూ భార్యతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో అతడికి పలు బుల్లితెర షోల నుంచి ఆఫర్లు వచ్చాయి. సతీసమేతంగా షోకు రండంటూ ఆహ్వానాలు అందడంతో పలు షోలలోనూ కనిపించి ఆకట్టుకున్నాడు.
అయితే అతడు బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లోనూ పాల్గొంటున్నాడని తెగ ప్రచారం జరిగింది. అతడు కూడా పలు ఇంటర్వ్యూల్లో తనకు బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. తీరా ఈ సీజన్‌లో మాత్రం పాల్గొనలేదు. తాజాగా అతడు బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ.. 'యాంకర్ రవి కోసమే బిగ్‌బాస్ చూస్తున్నాను. ఆయన నవ్వు, అందం.. అచ్చం మహేశ్‌బాబులానే ఉంటారు. నేను మహేశ్‌బాబు అభిమానిని. రవిని చూస్తుంటే మహేశ్‌బాబుగారే గుర్తొస్తారు. నా ఫుల్ సపోర్ట్ రవిగారికే! ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే అతడంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment