
Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదోవారం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్ మినహా ఇంటి సభ్యులందరిని నామినేషన్స్‌కి పంపిన బిగ్‌బాస్.. టాస్క్‌పేరుతో ఇద్దరిని సేఫ్ జోన్‌లోకి పంపాడు. దీంతో ఈ వారం నామినేషన్‌లో ఎనిమిదిమంది ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసిందో లేదో.. ఇంటి సభ్యులకు మరో గండం వచ్చిపడింది. అదే కెప్టెన్సీ టాస్క్. ఇందులో భాగంగా ఈ వారం ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనికోసం ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. విలన్స్ టీమ్‌లో రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ ఉన్నారు.
టీమ్‌ని రవి లీడ్ చేస్తున్నాడని, అతన్ని పడగొడితే టీమ్ మొత్తం సెట్ అయిపోతుందని షణ్ముఖ్ తన టీమ్ సభ్యులకు చెబుతున్నారు. మరోవైపు యాంకర్ రవి టాస్క్ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా’అని తన సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. రవిని టార్గెట్ చేసిన హీరోస్ టీమ్.. అతనికి ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అయితే రవి మాత్రం అన్నింటికీ తెగించి టాస్క్‌లు ఆడుతున్నాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.