
Bigg Boss 5 Telugu, Anchor Ravi Eliminated!: 'ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు' సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎలాగో సండే ఎపిసోడ్ షూటింగ్ శనివారమే పూర్తవుతుండటంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం ఒకరోజు ముందుగానే లీకవుతూ వస్తోంది. చివరకు అదే నిజమవుతోంది కూడా! ఈసారి రవి బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నాడన్న వార్త బయటకు రాగా అతడి ఫ్యాన్స్ షో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టాప్ 3లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్‌ను కనీసం టాప్ 5లోకి కూడా రాకముందే ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక సింగ్, కాజల్, సిరి కంటే కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవికే తక్కువ ఓట్లు ఎలా వస్తాయని నిలదీస్తున్నారు. నిజంగా ఆ ముగ్గురి కంటే రవికి తక్కువ ఓట్లు వచ్చినట్లైతే ఆ ఓట్ల లెక్క చూపించమని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రవిని కావాలని ఎలిమినేట్ చేశారన్న విషయాన్ని అంగీకరించమని సవాలు విసురుతున్నారు.
లేడీ కంటెస్టెంట్లను కాపాడటం కోసం రవిని అన్యాయంగా బయటకు పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న రవి ఇంత సడన్‌గా ఎలా ఎలిమినేట్ అవడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. రవి లేని బిగ్‌బాస్ షోను తాము చూడలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఏమని స్పందిస్తారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment