బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ రవి షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా స్పందించాడు. 'నేను వెళ్లేముందే చెప్పాను.. నన్ను ఆడుకోండి, వాడుకోండి, ట్రోల్ చేయండి, మీ ఇష్టమని చెప్పాను. కానీ చాలామంది నా ఫ్యామిలీని, నిత్యను ఇన్వాల్వ్ చేశారు. ఆఖరికి నా బిడ్డను కూడా వదల్లేదు. అంటే బయటొక బ్యాచ్ ఉంటుంది.. వాళ్లకు డబ్బులిస్తే వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా చెత్తగా మాట్లాడతారు.'
'రెండు వేల రూపాయలిస్తామంటే వాళ్ల తల్లిదండ్రుల గురించి కూడా చెడ్డగా రాసేవాళ్లు కొందరున్నారు. ఇంత దారుణమా? డబ్బు కోసం ఇంత నీచాతినీచంగా ఈ లెవల్‌లో దిగిపోతున్నమా? అందరికీ ఒక్కటే చెప్తున్నా.. లోపల జరిగేది ఒకటి, బయటకు వచ్చేది ఇంకొకటి. బయట డబ్బు తీసుకుని గేమ్ ఆడుతున్నవారు లోపలి గేమ్‌ను డామినేట్ చేస్తున్నారు. 24 గంటల్లో ఒకే గంట మాత్రమే చూపిస్తున్నారు. బిగ్‌బాస్ అనేది మైండ్ గేమ్.. వాళ్లూవీళ్లూ చెప్పేది కాకుండా మీకు ఎవరు బాగా ఆడుతున్నారనిపిస్తే వారికే ఓటేయండి' అని చెప్పుకొచ్చాడు రవి.
Comments
Please login to add a commentAdd a comment