Bigg Boss 5 Telugu Today Promo: అంతా నా వైపు అదోలా చూస్తున్నారు.. రవి ఎమోషనల్‌ - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: అంతా నా వైపు అదోలా చూస్తున్నారు.. రవి ఎమోషనల్‌

Published Tue, Sep 28 2021 4:30 PM | Last Updated on Tue, Sep 28 2021 6:49 PM

Bigg Boss 5 Telugu : Nataraj Master Open Up About Gunta Nakka - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరి ప్రవర్తన ఒక తీరు అయితే నటరాజ్‌ మాస్టర్‌ ప్రవర్తన మరోతీరు. నామినేషన్‌ ప్రక్రియ మొదలైయ్యిందంటే చాలు.. ఊగిపోతాడు. ఎవరైనా తనను నామినేషన్‌ చేస్తే చాలు తన వెనుక ఎవరో ఉన్నారని, అందుకే తనను నామినేట్‌ చేశారని ఆరోపిస్తాడు. తొలి వారం నుంచి నటరాజ్‌ మాస్టర్‌ ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. హౌస్‌లో అంతా నటిస్తున్నారని, తాను మాత్రమే ఓపెన్‌గా ఉంటున్నానని తనకు తాను కితాబిచ్చుకుంటాడు. అంతేకాదు ఇంట్లో గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఉన్నాయంటూ హౌస్‌మేట్స్‌పై విరుచుకుపడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఎవరో చెప్పడానికి మాత్రం మాస్టర్‌ వెనకడుగు వేయడం ఇంటి సభ్యులకు మింగుడుపడటం లేదు.
(చదవండి: ఏడేళ్లు సహజీవనం చేశా, నా ఆస్తి అడిగాడు: సరయూ)

ఇక నిన్నటి నామినేషన్స్‌లో కూడా గుంటనక్క ఇష్యూ తెరపైకి వచ్చింది. గుంటనక్క అని నన్నే అన్నావ్‌ కదా అని యాంకర్‌ రవి అడగ్గా.. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్‌ అని నటరాజ్‌ మాస్టర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఇక ఈ రోజు కూడా గుంటనక్క ఇష్యూపై ఇంట్లో చర్చ జరిగినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. పికాక్‌ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్‌ చేశాడు నటరాజ్‌ మాస్టర్‌. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్‌ అయ్యాడు రవి. దీంతో నటరాజ్‌ మాస్టర్‌ రవి దగ్గర గుంటనక్క మ్యాటర్‌ ఓపెన్‌ అయ్యాడు. ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి గుంటనక్క అని కరెక్ట్‌గా పేరు పెట్టారని అన్నాడు అంటూ విశ్వని ఇరికించాడు మాస్టర్‌. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. మరోవైపు నామినేషన్‌ ప్రక్రియ  రవి, కాజల్‌ మధ్య దూరం పెంచినట్లు తెలుస్తోంది. నన్ను చెంపపై కొట్టావని చెబుతూ రవి నామినేట్‌ చేయడాన్ని అస్సల్‌ రిసీవ్‌ చేసుకోలేకపోయింది కాజల్‌. నీతో మాట్లాడలని లేదు అని రవి ముఖం మీదే చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement