బిగ్‌బాస్‌: నటరాజ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు | Bigg Boss Telugu 5: Netizens Slam Nataraj For Calling Ravi a Snail | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రవిని మళ్లీ జంతువుతో పోల్చిన నటరాజ్‌, నెటిజన్ల ఫైర్‌

Published Fri, Oct 1 2021 8:25 PM | Last Updated on Fri, Oct 1 2021 9:47 PM

Bigg Boss Telugu 5: Netizens Slam Nataraj For Calling Ravi a Snail - Sakshi

బిగ్‌బాస్‌ షోను జంతుప్రదర్శనశాలగా మార్చేస్తున్నాడు నటరాజ్‌ మాస్టర్‌. ప్రతి ఒక్కరినీ ఒక్కో జంతువుతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్‌ తెప్పిస్తున్నాడు. తననేమైనా అంటే చెడుగుడు ఆడేసే ఈయన మిగతా కంటెస్టెంట్లను మాత్రం నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. వారిని ఆయా జంతువులతో పోలుస్తూ టార్చర్‌ పెడుతుంటాడు. మొదట్లో హౌస్‌లో గుంటనక్క ఉందని ప్రచారం చేశాడు నటరాజ్‌. ఆ గుంటనక్క ఎవరు? అని స్వయంగా హోస్ట్‌ నాగార్జున అడిగినప్పటికీ ఆయన పెదవి విప్పలేదు. పైపెచ్చు హౌస్‌లో ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండూ ఎవరో చెప్తానన్నాడు. అయితే రానురానూ ఆ రెండింటితో పాటు పిల్లి, నెమలి, ఎలుగుబంటి.. ఇలా ఎన్నో రకాల జంతువులు ఆయన లిస్టులో చేరాయి. 

అయితే రవిని గుంటనక్క అన్న అతడు.. ఇప్పుడు అదే రవిని నత్తతో పోల్చాడు, అది కూడా లోబో దగ్గర! దీంతో లోబో ఈ విషయాన్ని రవి చెవిలో ఊదాడు. దీంతో మరోసారి ఖంగు తిన్న రవి.. ఆయన తననెందుకు టార్గెట్‌ చేస్తున్నాడో అర్థం కావడం లేదని తల పట్టుకున్నాడు. సోషల్‌ మీడియాలో నెటిజన్లు కూడా నటరాజ్‌ మాస్టర్‌ పద్ధతి బాగోలేదని విమర్శిస్తున్నారు. ఒకటీరెండుసార్లు ఏదైనా అంటే లైట్‌ తీసుకుంటారేమోకానీ పదేపదే జంతువులతో పోల్చడం ఏంటి? అని తిట్టిపోస్తున్నారు. ఈయన హౌస్‌మేట్స్‌కు పూటకో జంతువు పేరు పెడతాడంటూ నటరాజ్‌ను జంతుశాస్త్ర పితామహుడు అని సెటైర్లు వేస్తున్నారు. ఈయనను బిగ్‌బాస్‌లో కాకుండా జంతు ప్రదర్శనశాలలో ఉంచాల్సిందని కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement